బ్రేకింగ్: హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం

Rakul preet singh: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలో ఆమె నివాసముంటున్న బిల్డింగ్ 12 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 08:00 PM IST
బ్రేకింగ్: హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం

Rakul preet singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నివాసం(Rakul preet singh house) ఉండే భవనంలో మంటలు(Fire Accident) చెలరేగాయి. ముంబైలో ఆమె నివాసముంటున్న బిల్డింగ్ 12 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు(Police) విచారణ చేపట్టారు.

Also Read: ర‌ష్మిక క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న ఫుడ్ సంస్థ.. రష్మిక మీల్స్‌ ఆఫర్

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్(Rakul preet singh).. ఆ తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుని..టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లోనూ పలు సినిమాలలో నటిస్తోంది. ఇటీవలే తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన 'కొండపొలం' సినిమాలో నటించి ఆకట్టుకుంది.  క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా.. ఈఏడాది తన పుట్టినరోజు సందర్భంగా.. రకుల్ తన ప్రేమ విషయాన్ని భయటపెట్టింది. నిర్మాత జాకీ భగ్నానీని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETimes (@etimes)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News