ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీపై వీహెచ్‌పీ, బీజేపి నేతలు పోలీసులకు ఫిర్యాదు

Ippudu Kaaka Inkeppudu movie: ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పలు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని పేర్కొంటూ విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నేతలు (VHP, BJP) హైదరాబాద్ లోని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 4, 2021, 12:57 PM IST
ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీపై వీహెచ్‌పీ, బీజేపి నేతలు పోలీసులకు ఫిర్యాదు

Ippudu Kaaka Inkeppudu movie: ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పలు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని పేర్కొంటూ విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నేతలు (VHP, BJP) హైదరాబాద్ లోని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీలో ఓ బెడ్ రూమ్ సన్నివేశంలో వేంకటేశ్వర స్వామి భజగోవిందం కీర్తన బ్యాగ్రౌండ్లో ప్లే అవుతుండటంపై వీహెచ్‌పీ, బీజేపి నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ ట్రైలర్లో (Ippudu Kaaka Inkeppudu movie trailer) చూపించిన దృశ్యాల ప్రకారం చూస్తే.. సినిమాలో తులసీ మాతతో పాటు హిందు దేవుళ్లపై అభ్యంతరకరంగా సన్నివేశాలు చిత్రీకరించినట్టు స్పష్టం అవుతోందని వీహెచ్‌పీ, బీజేపి నేతలు మండిపడుతున్నారు. ఆగస్టు 6న ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ విడుదల కానుండగా.. అంతకంటే ముందుగా సినిమా దర్శకుడు, నిర్మాతలను అరెస్ట్ చేయకపోతే.. సినిమా విడుదలను అడ్డుకుంటామని వీహెచ్‌పీ, బీజేపి నేతలు హెచ్చరిస్తున్నారు. 

Also read : యో యో హనీ సింగ్‌పై డొమెస్టిక్ వయోలెన్స్, లైంగిక వేధింపుల కేసు

సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని.. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని వీహెచ్‌పీ, బీజేపి నేతలు తేల్చిచెబుతున్నారు. ఈ సినిమాతో హస్వంత్ వంగ, నమ్రత దరేకర్  నటీనటులుగా టాలీవుడ్‌కి (Tollywood) పరిచయం అవుతున్నారు. యుగందర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీచక్ర క్రియేషన్స్ బ్యానర్‌పై చింత గోపికృష్ణా రెడ్డి నిర్మించారు.

Also read: KGF Chapter 2: కేజీఎఫ్ ఛాప్టర్ 2 లో సంజయ్ దత్ న్యూలుక్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News