Raashi Khanna Stood No.1 in IMDb: షారుఖ్ ఖాన్ ను వెనక్కు నెట్టి ఇండియన్ నెం.1గా నిలిచిన రాశి ఖన్నా!

Raashi Khanna Stood No.1 in IMDb: రాశి ఖన్నా షారుక్ ఖాన్ ని దాటేసి మొదటి స్థానంలోకి వెళ్ళింది అంటే నమ్మశక్యం కాకపోయినా ఇది మీరు నమ్మి తీరాల్సిందే, అసలు ఏమి జరిగిందో తెలుసుకుందాం పదండి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 23, 2023, 05:45 PM IST
  • షారుఖ్ ఖాన్ ను వెనక్కు నెట్టి ఇండియన్ నెం.1గా నిలిచిన రాశి ఖన్నా
  • ఐఎండీబీ లిస్టులో అరుదైన ఘనత
  • లిస్టులో షారుఖ్ ఖాన్ రెండో స్థానం
Raashi Khanna Stood No.1 in IMDb: షారుఖ్ ఖాన్ ను వెనక్కు నెట్టి ఇండియన్ నెం.1గా నిలిచిన రాశి ఖన్నా!

Raashi Khanna Beats Shahrukh Khan:  రాశి ఖన్నా షారుక్ ఖాన్ ని దాటేసి మొదటి స్థానంలోకి వెళ్ళింది, ఏంటి రాశి ఖన్నా ఏమిటి షారుక్ ఖాన్ దాటేసి మొదటి స్థానంలోకి వెళ్లడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా. అవును నిజమే మీరు విన్నది పూర్తిగా నిజమే. రాశి ఖన్నా షారుఖ్ ఖాన్ ని బీట్ చేసి నెంబర్ వన్ ఇండియన్ సెలబ్రిటీగా పేరు తెచ్చుకుంది. నమ్మశక్యం కాకపోయినా ఇది మీరు నమ్మి తీరాల్సిందే. ఒకరకంగా ఇది రాశి కన్నా కి ఒక కల నిజమైనట్లేననే ప్రచారం జరుగుతోంది.

అసలు ఏం జరిగింది షారుక్ ఖాన్ ను దాటేసి రాశి కన్నా మొదటి స్థానంలోకి ఎందుకు వెళ్ళింది అని ఆశ్చర్యపోతున్నారా. అయితే ఈ కథనం మొత్తం చదవాల్సిందే. అసలు విషయం ఏమిటంటే ఇండియన్ మూవీ డేటాబేస్ అంటే ఐఎండీబీ వెబ్సైట్ కొత్తగా ఒక వీక్లీ లిస్ట్ ప్రచురిస్తోంది. పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ అనే ఒక జాబితా ప్రచురిస్తోంది ఈ జాబితాలో రాశి కన్నా మొదటి స్థానం సంపాదించింది. ఇక తరువాతి స్థానాల్లో షారుక్ ఖాన్, విజయ్ సేతుపతి, రెజీనా కసాండ్రా, ఆదిత్య చోప్రా వంటి వారు స్థానాలు దక్కించుకున్నారు.

బాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఉన్న షారుక్ ఖాన్ సహా దీపిక పడుకునే లను రెండు, ఆరో స్థానాలు నెట్టి రాశి కన్నా మొదటి స్థానానికి చేరడం ఆమె ఇటీవల నటించిన వెబ్ సిరీస్ ఫర్జి వల్లనే అంటున్నారు. సదరు ఫర్జీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఫర్జీ  వెబ్ సిరీస్ ను ఫ్యామిలీ మెన్ మేకర్స్ రాజ్ డీకే తెరకెక్కించారు.

విజయ్ సేతుపతి సహా బాలీవుడ్ తారాగణం చాలా మంది నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది. ఆ వెబ్ సిరీస్ లో రాశిఖన్నా ఒక ఆర్బిఐ ఎంప్లాయ్ గా నటించింది. ఇక ఐఎండీబీ  చెబుతున్న వివరాల ప్రకారం ఈ లిస్ట్ అనేది ప్రేక్షకులు వేసే ఓట్లు అలాగే ఇండియాలో తమ వెబ్సైట్లో ఎక్కువ మంది ఎవరి గురించి సెర్చ్ చేస్తారు అనే విషయం మీద ఆధారపడి ఉంటుందని చెబుతోంది. ఆ లిస్టు అనేక అంశాలను బేస్ చేసుకుని ప్రచురిస్తామని ఎక్కువమంది వీక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఐఎండిబీ  పేర్కొంది.

Also Read:  Ram Charan Ayyappa Mala Rules: రామ్ చరణ్ మాలలో ఉండి చెప్పులు ధరించాడా? అసలు అయ్యప్ప మాల నియమాలు తెలుసా?

Also Read: Ram Charan Removed Ayyappa Mala: అమెరికాలో రామ్ చరణ్ అయ్యప్ప మాల తీశేశాడా? అసలు ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

 
 

Trending News