Kalki 2898 AD: కల్కి సినిమాతో పోలుస్తూ.. బాలీవుడ్ దర్శకుడు మీద ట్రోల్స్. ఇంతకీ అతనేవరంటే!

Kalki Review: ప్రభాస్ హీరోగా నటించిన.. కల్కి సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. సినిమాలోని మహాభారతం.. ఎపిసోడ్స్ ప్రేక్షకులకి మంచి.. హై.. ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓం మరొక ప్రభాస్ సినిమా దర్శకుడిపైన తెగ  రోల్స్ వేస్తున్నారు.. అభిమానులు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 28, 2024, 11:00 PM IST
Kalki 2898 AD: కల్కి సినిమాతో పోలుస్తూ.. బాలీవుడ్ దర్శకుడు మీద ట్రోల్స్. ఇంతకీ అతనేవరంటే!

Kalki Collections: ఓం రౌత్ దర్శకత్వంలో.. ప్రభాస్ నటించిన సినిమా ఆది పురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కిన.. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉనిన్నాయి. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మాత్రం.. ప్రభాస్ అభిమానులు కూడా సినిమా మీద మండిపడ్డారు. రామాయణంలోని ప్రతి పాత్రని చాలా అద్భుతంగా చూపించే అవకాశం ఉన్న కానీ.. ఓం రౌత్ చిత్రీకరణ.. ఏమాత్రం బాగోలేదని కామెంట్లు చేశారు. 

ఆ తర్వాత తెలుగులో ప్రశాంత్ వర్మ.. దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా.. హనుమాన్ సినిమా విడుదలై.. దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా విడుదలైన తర్వాత ప్రభాస్ అభిమానులు మరొకసారి.. ఆది పురుష్ ని, సినిమా తీసిన ఓం రౌత్ ను సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ చేశారు. 

సినిమా విడుదల అయ్యి ఎన్ని నెలలు గడుస్తున్నా కూడా ఇంకా ప్రభాస్ అభిమానులు..ఆ సినిమా డిజాస్టర్ ని మర్చిపోలేకపోతున్నారు. తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా.. విడుదలై ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తోంది. 

కేవలం 600 కోట్ల బడ్జెట్ తో నాగ్ అశ్విన్.. ఈ సినిమాని చిత్రీకరించారు. దీంతో మరొకసారి ప్రభాస్ అభిమానులు ఓం రౌత్ మీద మరొకసారి ట్రోలింగ్ మొదలుపెట్టారు. కేవలం 600 కోట్ల బడ్జెట్ తో నాగ్ అశ్విన్.. 3 విభిన్న ప్రపంచాలను చాలా అద్భుతంగా చిత్రీకరించారని కానీ ఓమ్ రౌత్ 700 కోట్ల.. బడ్జెట్ పెట్టుకుని కూడా సరిగ్గా.. తీయలేకపోయారని మరొకసారి ట్రోల్ చేస్తున్నారు. 

ముఖ్యంగా కల్కి సినిమాలో మహాభారతం ఎపిసోడ్స్ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. దానితో పోలుస్తూ ఓం రౌత్.. తీసింది అసలు రామాయణమే కాదు అని. పురాణాల్లో ఉన్నట్టు కాకుండా తనకి నచ్చినట్టు పాత్రలను రాసుకున్నారని, వాటిని డిజైన్ చేసుకున్నారని భారీ ఎత్తున తిట్టిపోస్తున్నారు. 

కల్కి సినిమాలో కర్ణుడి.. పాత్రలోనే నాగ్ అశ్విన్ ప్రభాస్ ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. సినిమాలో ప్రభాస్ మరీ ఎక్కువగా కనిపించకపోయినా.. కచ్చితంగా.. ప్రభాస్ కర్ణుడిగా కనిపించిన సీన్..  హై వస్తుంది. కానీ ఆది పురుష్ సినిమాలో.. సినిమా మొత్తం ప్రభాస్ కనిపిస్తారు. స్వయంగా శ్రీరాముడి.. పాత్రలోనే కనిపిస్తారు. కానీ ఒక్క సీన్ కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. 
చూస్తూ ఉంటే ప్రభాస్ అభిమానులు ఆది పురుష్ సినిమా డిజాస్టర్ ని అంత త్వరగా.. మరిచిపోయేలాగా కనిపించడం లేదు. ఓం రౌత్ ఎఫెక్ట్ ఆ రేంజ్ లో ఉంది. ఇలానే ఉంటే కల్కి 2 సినిమా విడుదలైన తర్వాత కూడా ఓం రౌత్ మీద ట్రోల్స్ కచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చు.

Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

Read more: Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News