Samantha Insta account Hack: సమంత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్ వెనుక ఇంత జరిగిందా?

Samantha Insta account Hack: సోమవారం రాత్రి సమంత ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ హ్యాక్ అయినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అది నిజం కాదని అంటున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2022, 01:11 PM IST
  • సమంత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ ప్రచారం
  • అసలు విషాదం అది కాదంటూ మరో ప్రచారం
  • పీఆర్ ఏజెన్సీ తప్పిదంతోనే
 Samantha Insta account Hack: సమంత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్ వెనుక ఇంత జరిగిందా?

Facts Behind Samantha Instagram account Hacking: ఇన్‌స్టాగ్రామ్ హ్యాకింగ్ వార్తలతో అనూహ్యంగా హీరోయిన్ సమంత వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి సమంత ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి కేటీఆర్ ఫోటో సహా మరికొన్ని సమంత పోస్ట్ చేయని, చేయాల్సిన అవసరం లేని ఫోటోలు షేర్ అయినట్టు గుర్తించారు.. వెంటనే విషయం అర్థమైన తర్వాత ఆ ఫోటోలను తొలగించి చిన్న టెక్నికల్ గ్లిచ్ కారణంగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం ఆమె అకౌంట్ హ్యాక్ అయిందంటూ ప్రచారం జరిగింది. 

అయితే అసలు విషయం ఏమిటంటే ఆమె అకౌంట్ హ్యాక్ కాలేదట. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ సహా మిగతా సోషల్ మీడియా ఖాతాల నిర్వహణను ఒక పీఆర్ ఏజెన్సీ కి అగించిందని సదర్ పీఆర్ ఏజెన్సీ సమంతతో పాటు మరికొందరు ప్రముఖుల ఖాతాలు కూడా నిర్వహిస్తోందని తీలుస్తోంది. అందులో భాగంగానే ఒకరి ఖాతాలో పోస్ట్ చేయాల్సిన ఫోటోలు మరొకరి ఖాతాలో పోస్ట్ చేశారని అంటున్నారు. విషయం అర్థమైన తర్వాత సదరు పీఆర్ సంస్థకు చెడ్డపేరు రాకుండా అకౌంట్ హ్యాక్ అయిందంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండాలని టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలు మాత్రం తమ తమ సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ కోసం ప్రత్యేక టీములను నియమించుకున్నారు. వీటిని కనుక ఒక సపరేట్ ఏజెన్సీకి అప్పగిస్తే ఇలాంటి తలనొప్పి తప్పదని భావించి వారు డబ్బులు కాస్త ఎక్కువగానే వెచ్చించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి తమ సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ వ్యవహారాలు చూసుకుంటున్నారని చెబుతున్నారు మొత్తం మీద సమంత వ్యవహారంతో ఇప్పటికైనా సినీ, రాజకీయ ప్రముఖులు మేలుకొని పీఆర్ ఏజెన్సీల ద్వారా కాకుండా సొంతంగా తమ ఖాతాలు నిర్వహించుకుంటే ఇలాంటి పరిణామాలు మళ్ళీ మళ్ళీ ఎదురవకుండా ఉంటాయని చెప్పవచ్చు. 
Also Read: Keeravani: రసూల్ ను దారుణమైన పదంతో ట్రోల్ చేసిన కీరవాణి.. ఎక్కడా తగ్గట్లేదుగా!

Also Read: Major Closing Collections: అడవి శేష్ మేజర్ మూవీ ఎన్ని కోట్లు లాభం సాధించిందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News