Ashu Reddy - Express Hari: మళ్లీ మొదలెట్టేశార్రా.. TRP కోసం లవ్ ప్రపోజల్స్..? అషూ కోసం స్టేజ్ మీదే ఏడ్చేసిన హరి

Express Hari Showing Ashu Tattoo: బుల్లితెరపై లవ్ ట్రాకులు కొత్తేమీ కాదు. అయితే అషూ రెడ్డి, హరిల ట్రాక్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అషూ టాటూను ఎదపే వేసుకుని షాక్ ఇచ్చాడు ఎక్స్ ప్రెస్ హరి. దీంతో ఈ ఇద్దరి ప్రేమ కథ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2023, 09:19 AM IST
  • బుల్లితెరపై టీఆర్పీ స్టంట్లు
  • అషూ, హరిల లవ్ ట్రాక్
  • స్టేజ్ మీదే ఏడ్చేసిన హరి
Ashu Reddy - Express Hari: మళ్లీ మొదలెట్టేశార్రా.. TRP కోసం లవ్ ప్రపోజల్స్..? అషూ కోసం స్టేజ్ మీదే ఏడ్చేసిన హరి

Ashu Reddy & Express Hari Love Track: బుల్లితెరపై రష్మీ సుధీర్, వర్ష ఇమాన్యుయేల్, రాకేష్ సుజాత, అషూ రాహుల్, అషూ ఎక్స్ ప్రెస్ హరి ఇలా ఎన్నెన్నో ట్రాకులున్నాయి. ఇందులో సుజాత రాకేష్‌ ట్రాక్ మాత్రం పెళ్లి వరకు వెళ్లింది. వర్ష ఇమాన్యుయేల్ అయితే పక్కా స్క్రిప్టెడ్‌ అని అర్థం అవుతుంటుంది. రష్మీ సుధీర్ స్టేజ్ మీద ఎన్ని నాటకాలు ఆడినా తెర వెనక ఏమీ ఉండదని అందరికీ తెలిసిసోయింది. అషూ రెడ్డి మాత్రం ఎటూ అర్థం కాదు. రాహుల్‌తో ఉంటుంది, హరితోనూ ఉంటుంది.

అషూ రెడ్డి బుల్లితెరపై చేసిన కామెడీ స్టార్స్ షోలో ఎక్స్ ప్రెస్ హరితో ట్రాక్ సెట్ చేసింది టీం. హరి అషూల ట్రాక్ బాగానే వర్కౌట్ అయింది. హరి కోసం బైక్ కొనిచ్చింది అషూ. ఇక అషూ పేరుని ఎదపై టాటూ వేయించుకున్నాడు హరి. అది నిజమైన టాటూనా? కాదా? అన్నది మాత్రం క్లారిటీగా తెలియడం లేదు. పదే పదే ఆ టాటూని చూపిస్తుంటాడు హరి.

అయితే ఈ ఇద్దరూ ఇప్పుడు శ్రీముఖి చేస్తోన్న ఓ షోకు గెస్టులా వచ్చారు. ఇందులోనూ మళ్లీ పాత పాటే పాడారు. ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్ ఆడగా.. డేర్ అని ముందుకు వచ్చాడు హరి. అషూకి ముద్దు పెట్టాలని శ్రీముఖి టాస్క్ ఇచ్చింది. ఇక ముద్దు పెట్టడమే కాదు స్టేజ్ మీదే ప్రపోజ్ చేశాడు హరి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News