Prabhas Producer Divorce Issue: విడాకుల బాటలో మరో జంట.. రచ్చ కెక్కిన ప్రభాస్ నిర్మాత డివోర్స్ ఇష్యూ..

Prabhas Producer Divorce Issue: సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరగుతాయో.. అంతే వేగంగా విడాకులు జరగుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో విడాకులు అనేది అన్ని వర్గాల్లో కామన్ అయిపోయినా.. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి అందరి ఫోకస్ సినిమా వాళ్లపైనే ఉంటుంది. ఈ కోవలో ప్రభాస్ నిర్మాత భూషణ్ కుమార్ డైవోర్స్ ఇష్యూ ఇపుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 25, 2024, 11:52 AM IST
Prabhas Producer Divorce Issue: విడాకుల బాటలో మరో జంట.. రచ్చ కెక్కిన ప్రభాస్ నిర్మాత డివోర్స్ ఇష్యూ..

Prabhas Producer Divorce Issue: సినీ ఇండస్ట్రీలో పెళ్లిల్ల మ్యాటర్‌తో పాటు విడాకుల ఇష్యూ ఎపుడు హాట్ టాపిక్ అనే చెప్పాలి. తాజాగా ప్రభాస్‌తో 'సాహో', 'ఆదిపురుష్' సినిమాలను నిర్మించిన భూషణ్ కుమార్ విడాకుల మ్యాటర్ బాలీవుడ్‌లో రచ్చ లేపుతోంది. తాజాగా అతని భార్య దివ్యా కోస్లా విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలె దివ్యా కోస్లా.. తన సోషల్ మీడియా అకౌంట్లో పేరు చివరన ఉన్న కుమార్ పేరును తీసేసింది. దాంతో పాటు టీ సిరీస్‌ను అన్‌ఫాలో చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరిగిందనే వార్త బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఓ జ్యోతిష్యుడి సలహా మేరకే ఈమె తన పేరు చివరన కుమార్ పేరును తొలిగించినట్టు టీ సిరీస్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

పెళ్లైన తర్వాత ఈమె ఇంటి గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే తన భర్తకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలను చూసుకుంటుంది. అలాంటి ఆమెకు పేరు చివరన కుమార్ తొలిగించడంతో జరిగే మేలు ఏమిటనే ప్రశ్నలు నెటిజన్స్ నుంచి వస్తున్నాయి. ప్రస్తుతం టీ సిరీస్ నిర్మాణ రంగంలో రారాజుగా ఉన్నారు. జ్యోతిష్యుడి సలహా మేరకు కుమార్ పేరు తొలిగిస్తే.. ఓకే కానీ.. ఈమె టీ సిరీస్ ను ఎందుకు అన్ ఫాలో అయినట్టు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దాల్ మే కుచ్ కాలా హై అన్నట్టు వీళ్లిద్దరి మధ్య ఏదో జరిగి ఉండకపోతే ఇలాంటివి జరగవు. ఏదైనా చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నా తరహాలో ఉంది ఈ వ్యవహారం. మరి త్వరలో వీరిద్దరు విడాకుల వ్యవహారం టీ కప్పులో తుఫానులా ముగుస్తుందా ? లేకపోతే నిజంగానే డైవోర్స్ తీసుకుంటారా అనేది చూడాలి.

భూషణ్ కుమార్.. గతేడాది ప్రభాస్‌తో 'ఆదిపురుష్' మూవీ నిర్మించారు. అటు రణ్‌బీర్ కపూర్‌తో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'యానిమల్' మూవీ నిర్మించారు. ఈ సినిమా దాదాపు రూ. 900 కోట్లకు పైగా రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపింది. ఇక ప్రభాస్ విషయానికొస్తే.. గతేడాది చివరలో 'సలార్' మూవీతో పలకరించారు. ఈ యేడాది మే 9న 'కల్కి 2898 AD' మూవీతో పలకరించబోతున్నాడు. మరోవైపు 'ది రాజాసాబ్'  మూవీ ఉండనే ఉంది. అటు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, సిద్ధార్ధ్ ఆనంద్‌తో డిఫరెంట్ యాక్షన్ మూవీతో పాటు సలార్ 2 మూవీలు లైన్‌లో ఉన్నాయి.

Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్ట్‌ తప్పదా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News