Mega Family - Uday Kiran: మెగా ఫ్యామిలీ- ఉదయ్ కిరణ్ కు గొడవ పెట్టిన పత్రికాధినేత.. పవన్ కళ్యాణ్ మ్యాన్ హ్యాండ్లింగ్!

 Rift Between Pawan Kalyan and Uday Kiran: డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ గురించి చేసిన కామెంట్లు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇదే విషయం మీద డైరెక్టర్ గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 23, 2022, 08:17 AM IST
  • మెగా ఫ్యామిలీ- ఉదయ్ కిరణ్ కు గొడవ పెట్టిన పత్రికాధినేత..
  • పవన్ కళ్యాణ్ మ్యాన్ హ్యాండ్లింగ్!
  • అప్పటి విషయాలు బయట పెట్టిన డైరెక్టర్
Mega Family - Uday Kiran: మెగా ఫ్యామిలీ- ఉదయ్ కిరణ్ కు గొడవ పెట్టిన పత్రికాధినేత.. పవన్ కళ్యాణ్ మ్యాన్ హ్యాండ్లింగ్!

Dispute Between Mega Family and Uday Kiran : హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ఎందుకు చనిపోయాడు? అనే విషయం మీద ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. పోలీసులు కూడా విచారణ జరపడానికి ప్రయత్నించారు కానీ ఆ కేసు ఏమైందో ఇప్పటికీ తెలియదు. అయితే ఈ మధ్యకాలంలో జీ తెలుగు న్యూస్ కి ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ మరణానికి గల కారణాలు తనకు తెలుసు అని అయితే అవి ఇప్పుడు బయట పెట్టలేనని చెప్పుకొచ్చారు.

తాను చనిపోయే లేపు బయట పెడతాను కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదని ఆయన కామెంట్ చేశారు. ఇక ఈ అంశం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయారు ఆ విషయం తెలిసిన తేజ ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇప్పుడు ఆయన బయట ఎందుకు పెట్టారు? అనే ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ ఉదయ్ కిరణ్ మరణం గురించి తేజ ఏమైనా సినిమా చేయాలని అనుకుంటున్నారా? తన క్రేజ్ పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో తేజ కావాలని ఇలాంటి కామెంట్స్ చేశారా అనే వార్తల నేపథ్యంలో డైరెక్టర్ గీతాకృష్ణ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తెలుగులో సంకీర్తన అనే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బెస్ట్ డబ్ల్యు డైరెక్టర్ గా నంది అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత తెలుగులో కోకిల, కీచురాళ్ళు, ప్రియతమా, సర్వర్ సుందరం గారి అబ్బాయి, టైం, కాఫీ బార్ అనే సినిమాలు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News