Teja Ahimsa : నువ్వేం పీకావ్ అని పరువుతీసిన తేజ.. దెబ్బకు ఏడ్చేసిన దగ్గుబాటి అభిరామ్‌

Director Teja About Daggubati Abhiram దగ్గుబాటి అభిరాం ఎంత ఫేమస్ అన్నది అందరికీ తెలిసిందే. శ్రీరెడ్డి వ్యవహారంతో అభిరాం ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు తేజ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. అహింస సినిమాతో అభిరాం హీరోగా మారబోతోన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2023, 01:27 PM IST
  • గోపీచంద్‌తో తేజ ఇంటర్వ్యూ
  • అభిరాం మీద డైరెక్టర్ కామెంట్స్
  • నువ్వేం పీకావ్ అని అడిగిన తేజ
Teja Ahimsa : నువ్వేం పీకావ్ అని పరువుతీసిన తేజ.. దెబ్బకు ఏడ్చేసిన దగ్గుబాటి అభిరామ్‌

Director Teja About Daggubati Abhiram డైరెక్టర్ తేజ్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక తేజ అయితే సెట్స్ మీద చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడని, అవసరం అయితే ఆర్టిస్టులను కొడతాడనే పేరు కూడా ఉంది. ఇదే విషయాన్ని తాజాగా గోపీచంద్ కూడా ప్రస్థావించాడు. గోపీచంద్ తన రామబాణం సినిమా ప్రమోషన్స్ కోసం తేజతో ఇంటర్వ్యూ చేశాడు. ఇక తేజ అడిగిన ప్రశ్నలకు గోపీచంద్ సమాధానం చెప్పాడు. గోపీచంద్ ప్రశ్నలకు తేజ కూడా శాంతంగా సమాధానం ఇచ్చాడు.

రామబాణం సినిమా గురించి, సినిమా కథ గురించి, డైరెక్టర్‌తో గొడవలు జరిగాయనే రూమర్ల మీద ఇలా తేజ బాగానే ప్రశ్నలు సంధించారు. ఎడిటింగ్‌లో ఎగిరి పోతుందని తనకు అర్థమైన సీన్లను తీయొద్దు అని డైరెక్టర్‌కు చెప్పేవాడ్ని.. కానీ ఆయన వినేవాడు కాదు.. సరే అని వదిలేసేవాడ్ని.. చివరకు ఎడిటింగ్‌లో ఆ సీన్లు పోయాయ్.. నిర్మాతకు ఖర్చు ఎందుకు అని నేను అనుకున్నాను.. అలా చిన్న చిన్నవే జరిగాయని పెద్ద గొడవలేం కాదని చెప్పుకొచ్చాడు గోపీచంద్.

ఇక సెట్‌లో మీరు అందరినీ కొడతారనే అంతా అనుకుంటారు.. కొట్టరని నాకు తెలుసు.. కానీ ఈ అహింస సినిమా విషయంలో అలాంటిదేమైనా జరిగిందా? అని గోపీచంద్ అడిగాడు. అతను పెద్ద నిర్మాత కొడుకు కదా? ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? అని గోపీచంద్ ప్రశ్నించాడు. తన సెట్‌లో అందరూ సమానమే అని, మీ తాత గొప్పోడే.. మీ నాన్న గొప్పోడే.. మీ బాబాయ్ కూడా గొప్పోడే కానీ నువ్వేం పీకావ్‌? అని అభిరాంను అడిగాను. 

Also Read: Kriti Sanon Sita Posters : అశోకవనంలో సీత.. ఆదిపురుష్ నుంచి కృతి సనన్ లుక్.. పిక్స్ వైరల్

ఆ దెబ్బతో బ్లాంక్ అయ్యాడు.. సెట్‌లో రెండు మూడు సార్లు పక్కకి వెళ్లి ఏడ్చాడు కూడా అని తేజ చెప్పుకొచ్చాడు. అలా తన అహింసా సినిమా గురించి కూడా తేజ చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా సినిమాను తీసి వాళ్లకు ఇవ్వడమే తన పని అని, విడుదల విషయంలో నిర్మాతలదే ఫైనల్ కాల్ అని, వారికి చెప్పేటనంత సీన్ తనకు లేదని తేజ అన్నాడు.

Also Read:  Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News