Nag Ashwin on Lockdown: లాక్‌డౌన్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Nag Ashwin on Lockdown: కరోనా సెకండ్ వేవ్..దేశంలో మహా విషాదానికి కారణమవుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాలు మాత్రం నైట్‌కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌లతో సరిపెడుతున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 29, 2021, 05:57 PM IST
Nag Ashwin on Lockdown: లాక్‌డౌన్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Nag Ashwin on Lockdown: కరోనా సెకండ్ వేవ్..దేశంలో మహా విషాదానికి కారణమవుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాలు మాత్రం నైట్‌కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌లతో సరిపెడుతున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా మహమ్మారి దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారు.సెకండ్ వేవ్(Corona Second Wave) ప్రతాపానికి రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు.ఆక్సిజన్( Oxygen Shortage), బెడ్స్, మందులు లభించక అల్లాడుతున్నారు. రోజురోజుకూ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. దేశంలో నెలకొన్న దారుణ పరిస్థితుల్ని చూసి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్( Lockdown) అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం నైట్ కర్ఫ్యూ(Night Curfew), వీకెండ్ లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దేశంలో లాక్‌డౌన్ పరిష్కారం కాదని ప్రధాని మోదీ (Pm Narendra modi)సహా నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ లాక్‌డౌన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 

దేశంలో లాక్‌డౌన్ (Lockdown) విధించినా..విధించకపోయినా వ్యక్తిగతంగా రెండు వారాల పాటు లాక్‌డౌన్ పాటిద్దామని దర్శకుడు నాగ్ అశ్విన్ (Director Nag Ashwin) సూచిస్తున్నారు. ప్రస్తుం ఉన్న పరిస్థితుల్లో లాక్‌డౌన్ సమాధానం కాదని చెప్పేవాళ్లు..ఓసారి ఆసుపత్రులకు వెళ్లి చూడాలని నాగ్ అశ్విన్ సూచించారు.గత  నెలరోజుల్నించి వైద్యులు ఎలా సేవలందిస్తున్నారో చూడాలని కోరారు. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుందామని..వైద్యులకు రిలీఫ్ ఇద్దామని ట్విట్ చేశారు. పాన్ ఇండియా చిత్రంగా దీపికా పదుకోన్, ప్రభాస్‌(Prabhas)తో ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఓ సినిమా చేస్తున్నారు. 

Also read: Venkatest లేటెస్ట్ మూవీకి కరోనా ఎఫెక్ట్, విక్టరీ వెంకటేష్ Narappa Movie రిలీజ్ వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News