Hari Hara Veera Mallu : ఇరవై ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్‌ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. క్రిష్‌ కామెంట్స్ వైరల్

Pawan Kalyan Martial Arts Practice Session పవన్ కళ్యాణ్‌ తాజాగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ను మళ్లీ మొదలుపెట్టాడట. ఈమేరకు ఓ స్టిల్‌ను షేర్ చేశాడు పవన్ కళ్యాణ్‌. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2022, 10:05 PM IST
  • సెట్స్ మీద హరి హర వీరమల్లు
  • మార్షల్ ఆర్ట్స్ సెషన్స్‌లో పవన్ కళ్యాణ్‌
  • ప్రపంచం మొత్తం చూడాల్సిందేనన్న క్రిష్‌
Hari Hara Veera Mallu : ఇరవై ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్‌ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. క్రిష్‌ కామెంట్స్ వైరల్

Pawan Kalyan Martial Arts పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ చిన్నతనం నుంచే వచ్చు అన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ సినిమాల్లోకి రాకముందే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడన్న విషయం విదితమే. అందుకే మొదటి సినిమా అయిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయిలో స్టంట్స్ చేశాడు. తమ్ముడు సినిమాలో రకరకాల ఫీట్స్ చేశాడు. అయితే తాజాగా తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్‌కు మరోసారి పదును పెట్టేందుకు పవన్ కళ్యాణ్‌ రెడీ అయ్యాడు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత పవన్ కళ్యాణ్ మళ్లీ మార్షల్ ఆర్ట్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నాడట.

ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్‌ చెబుతూ అదిరిపోయే స్టిల్‌ను షేర్ చేశాడు. ఇక దీనిపై క్రిష్‌ స్పందించాడు. పవన్ కళ్యాణ్‌ సర్.. హరి హర వీరమల్లు సెట్స్‌లో ఇలా ముందు వరుసలో కూర్చుని మీ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చూడటం నాకు ఎంతో సంతోషంగా, గౌరవంగా అనిపిస్తోంది.. అభిమానులకు, సినీ ప్రేక్షకులకు, ఈ ప్రపంచానికి మీ ప్యాషన్, డెడికేషన్, కష్టపడేతత్వాన్ని చూపించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటూ క్రిష్‌ ట్వీట్ వేశాడు.

 

ఇక ఈ స్టిల్‌తో హరి హర వీరమల్లు సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉండబోతోన్నాయో స్పష్టమవుతోంది. అసలే హరిహర వీరమల్లు సినిమా మీద రకరకాల రూమర్లు వస్తుంటాయి. సినిమా మరింత ఆలస్యం అవుతోందని, అసలు సినిమానే ఆపేశారంటూ ఇలా ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక హరి హర వీరమల్లు సెట్స్ మీదుండగానే పవన్ కళ్యాణ్‌ వరుస పెట్టి సినిమాలను ప్రకటిస్తూనే ఉన్నాడు. 

కానీ ఎంత త్వరగా ప్రకటిస్తున్నాడో.. వాటిని పట్టాలెక్కిచేందుకు, రిలీజ్ చేసేందుకు అంతగా ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న సుజిత్‌తో ఓ సినిమాను పవన్ కళ్యాణ్‌ అనౌన్స్ చేశాడు. కానీ అప్పుడెప్పుడు అనౌన్స్ చేసిన హరిష్‌ శంకర్ చిత్రాన్ని మాత్రం ఇంత వరకు పట్టాలెక్కించలేదు. అసలు ఆ సినిమా ఉందో లేదో అన్న అనుమానం కూడా జనాల్లోకి వచ్చేసింది. కానీ నేడు హరి హర వీరమల్లు సెట్‌లో దర్శకుడు హరీష్‌ శంకర్ సందడి చేశాడు. భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ క్రిష్‌ ఓ ట్వీట్ వేయడంతో ఈ సినిమా మీద మళ్లీ ఆశలు చిగురించాయి. 

Also Read : Adivi Sesh : కుక్క కంటే తక్కువ స్క్రీన్ స్పేప్.. ఇది నా శాపం.. అడివి శేష్‌పై నెటిజన్ కామెంట్

Also Read : RJ Surya and Aarohi : కష్టం, సుఖం పంచుకుంటాం.. సూర్యపై ఆరోహి కామెంట్స్.. బిగ్ బాస్ అనంతరం ఇలా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News