షాక్ ఇచ్చిన అభిమాని...ఖరీదైన బహుమతి ఇచ్చిన ప్రభాస్

ఓ అభిమాని బాహుబలిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. దాంతో ప్రభాస్ షాక్ తిన్నాడు. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 03:45 PM IST
షాక్ ఇచ్చిన అభిమాని...ఖరీదైన బహుమతి ఇచ్చిన ప్రభాస్

Prabhas: డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు ప్రభాస్(Prabhas). తాజాగా ఓ అభిమాని(Fan) ప్రభాస్‌కి షాక్చిచే రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. తలపై ప్రభాస్ అని అక్షరాలు కనిపించేలా గుండు కొట్టించుకున్నాడు. అతని అభిమానాన్ని చూసి షాక్‌ అయిన ప్రభాస్‌ సరదాగా అతడితో కాసేపు కబర్లు చెప్పాడు.

అనంతరం తన వీరాభిమానికి ఖరీధైన వాచ్‌ను గిఫ్ట్‌(Gift)గా ఇచ్చాడు. ఇది ఫాజిల్‌ కంపెనీకి చెందిన వాచ్‌ గా సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ప్రభాస్‌ తన అభిమానులకు ఇలా గిఫ్ట్‌లు ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ డార్లింగ్(Darling prabhas) ప‌లువురికి బ‌హుమ‌తులు ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేశారు. 

Also Read: రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ సినిమా ట్రైలర్ వచ్చేసింది

ఇక సినిమాల విషయానికి వస్తే.. వచ్చే ఏడాది సంక్రాంతికి రాధేశ్యామ్‌(Radhe Shyam)తో సందడి చేయనున్నాడు ప్రభాస్‌. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్'(Adipurush) సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇందులో ప్రభాస్ రాముడిగా సందడి చేయనున్నారు. ఈ చిత్రంలో కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా కీలకపాత్రలు పోషించారు. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

 

Trending News