Unstoppable with NBK: అన్‌స్టాపెబుల్ బాలకృష్ణతో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన పెళ్లి సీక్రెట్ చెప్పేశాడా లేదా

Unstoppable with NBK: ఆహాలో స్ట్రీమ్ అవుతున్న బాలకృష్ణ అన్‌స్టాపెబుల్ ఈసారి మహేశ్ బాబుతో ఫన్నీగా సాగింది. ఆ ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 4, 2022, 05:15 PM IST
Unstoppable with NBK: అన్‌స్టాపెబుల్ బాలకృష్ణతో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన పెళ్లి సీక్రెట్ చెప్పేశాడా లేదా

Unstoppable with NBK: ఆహాలో స్ట్రీమ్ అవుతున్న బాలకృష్ణ అన్‌స్టాపెబుల్ ఈసారి మహేశ్ బాబుతో ఫన్నీగా సాగింది. ఆ ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో నందమురి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపెబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ వ్యూయర్‌షిప్‌తో ప్రోగ్రాం దూసుకుపోవడమే కాకుండా పేరుకు తగ్గట్టుగానే అన్‌స్టాపెబుల్ అన్పిస్తోంది. హోస్ట్ బాలకృష్ణ తగ్దేదే లే అంటున్నాడు. ఈసారి ప్రముఖ నటుడు మహేశ్‌బాబుతో అన్‌స్టాపెబుల్ ఫన్నీగా సాగింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ఆహాలో స్ట్రీమ్ కానున్న ఈ షో ప్రోమో ఇప్పటికే విడుదలై...ట్రెండ్ అవుతోంది. Did Mahesh Babu reveals his marriage secret in unstoppable with nbk

సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ఫన్నీగా సాగిన ఈ ప్రోమోలో..తన సినిమాల్లోంచి ఏదో ఒక సినిమా డైలాగ్ చెప్పమని బాలకృష్ణ కోరడం కన్పిస్తుంది. దీనికి సమాధానంగా మీ డైలాగులు మరొకరు చెప్పలేరు, మీరు మాత్రమే చెప్పగలరు సార్ అంటూ మహేశ్‌బాబు చెప్పడంతో హోస్ట్ బాలకృష్ణ పెద్దగా నవ్వుతాడు. అఖండ్ హీరో బాలకృష్ణ మహేశ్‌బాబు చిన్నతనంలోని కొన్ని మూమెంట్స్ గురించి ప్రశ్నిస్తాడు. మీరు మీ చిన్నతనంలో కొంటె పనులు చేయడం ఆ తరువాత నవ్వడం చేసేవారట కదా..ఎందుకలా అని ప్రశ్నిస్తే..మహేశ్‌బాబు తిరిగి నవ్వే ఓ ఓ సమాధానంగా చెప్పాడు.

ఇక చివరిగా మహేశ్‌బాబు(Mahesh Babu), నమ్రతా శిరోద్కర్ పెళ్లి విషయం..ఎప్పుడు ఎలా జరిగిందని అడిగినప్పుడు ప్రోమో సస్పెన్స్‌తో ముగుస్తుంది. మహేశ్‌బాబు తన పెళ్లి రహస్యం బట్టబయలు చేశాడా లేదా ఏం జరిగింది. అది తెలుసుకోవాలంటే ఇవాళ రాత్రి 8 గంటలకు చూడాల్సిందే.

Also read: Alia Bhatt Hot photos: 'గంగూబాయ్' బ్యూటీ ఆలియా భట్ అందాల విందు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News