Dhanush Telugu movie: టాలీవుడ్​లోకి ధనుష్ 'సార్​' ఎంట్రీ ఇస్తున్నారు- త్వరలోనే షూటింగ్​ షురూ..

Dhanush Telugu movie: కోలివుడ్​ స్టార్ హీరో ధనుష్​ తెలుగులో తొలి సినిమాను ప్రకటించారు. ఈ మూవీకి 'సార్' అనే టైటిల్​ను ఫిక్స్​ చేశారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 02:18 PM IST
  • తొలి తెలుగు సినిమా పేరు ప్రకటించిన ధనుష్​
  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో రానున్న చిత్రం
  • త్వరలోనే పట్టాలెక్కనున్ననట్లు చిత్ర బృందం వెల్లడి
Dhanush Telugu movie: టాలీవుడ్​లోకి ధనుష్ 'సార్​' ఎంట్రీ ఇస్తున్నారు- త్వరలోనే షూటింగ్​ షురూ..

Dhanush Telugu movie: కొలవెరి డీ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ సినిమా సినిమాకు వైవిద్యామైన పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళంతో పాటు ఆయన సినిమాలు తెలుగులోను డబ్​ అవుతుంటాయి. ఇలా రఘువరన్ బీటెక్​, మారీ వంటి సినిమాలు ఇక్కడ మంచి విజయం సాధించాయి.

అయితే తెలుగు వారికి మరింత దగ్గరయ్యేందుకు ధనుష్​.. నేరుగా తెలుగు సినిమాలో (Dhanush straight Telugu Film) నటిస్తున్నారు. తమళంలోనూ ఈ సినిమాను ఏకకాలంలో తెరకెక్కనుంది.

ఈ సినిమా టైటిల్​ను తాజాగా వెల్లడించింది చిత్ర బృందం. తెలుగులో ఈ సినిమాను 'సార్​' పేరుతో (Dhanush  Telugu Film Sir) రానుంది. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇంతకు ముందు  'తొలి ప్రేమ' (వరుణ్​ తేజ్​ సినిమా), రంగ్​దే వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వెంకీ అట్లూరీ (Venky Atluri).

ఈ సినిమా తమిళంలో 'వాతి'గా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో సంయుక్త మేనన్​ హీరోయిన్​. జీవీ ప్రకాశ్ (GV Prakash)​ మ్యూజిక్ అందిస్తున్నారు. నాగ వంశి- సాయి సౌజన్య నిర్మాతలు.

Also read: RRR Movie 4th Single: RRR నుంచి మరో సర్ ప్రైజ్- 'రోర్ ఆఫ్ భీమ్' సాంగ్ ప్రోమో రిలీజ్

Also read: Shyam Singha Roy Tara Song: 'శ్యామ్ సింగరాయ్' చిత్రం నుంచి 'తారా' సాంగ్ వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News