Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రికి మళ్లీ మేకప్‌.. రాజధాని అమరావతి చేరువలో 'హరి హర వీర మల్లు' షూటింగ్‌

Pawan Kalyan Will Be Joins Hari Hara Veera Mallu Movie Sets: డిప్యూటీ సీఎం కాస్త ఇప్పుడు మళ్లీ పవర్‌ స్టార్‌గా మారనున్నాడు. పెండింగ్‌లో ఉంచిన హరిహర వీర మల్లు సినిమా కోసం పవన్‌ కల్యాణ్ రంగంలోకి దిగనున్నాడు. యుద్ధక్షేత్రంలోకి దిగుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 28, 2024, 06:50 PM IST
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రికి మళ్లీ మేకప్‌.. రాజధాని అమరావతి చేరువలో 'హరి హర వీర మల్లు' షూటింగ్‌

  Hari Hara Veera Mallu: రాజకీయాలు, ప్రభుత్వ పాలనలో తలమునకలైన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మళ్లీ మేకప్‌ వేసుకోనున్నారు. రాజధాని అమరావతికి ప్రాధాన్యమిచ్చేలా విజయవాడ సమీపంలోనే షూటింగ్‌ నిర్వహిస్తుండడం విశేషం. ఈ మేరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే హీరోగా పవన్‌ కల్యాణ్‌ మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నాడని చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా భారీ సెట్‌ రూపొందిస్తున్నారని సమాచారం. ఈ మేరకు హరి హర వీర మల్లు సినిమా అప్‌డేట్స్‌ ఇలా ఉన్నాయి.

ఇది చదవండి: Allu Arjun: రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీడియో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినీ ప్రయాణంలో తొలిసారిగా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పీరియాడికల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ప్రేక్షకులు, అభిమానులకు కొత్తదనం అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. పవన్ కల్యాణ్‌తో పాటు 400 - 500 మందితో ఈ భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించగా.. ఈ యుద్ధ సన్నివేశం సినిమాకే హైలెట్‌ నిలుస్తుందని చిత్రబృందం భావిస్తోంది.

ఇది చదవండి: Dhanush Divorce: కోర్టు తీర్పు.. ధనుష్‌, ఐశ్వర్యల 18 ఏళ్ల వివాహ మామిడాకులు విడాకులయ్యాయి

'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' చిత్రం క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు కీలక విషయాన్ని ప్రకటించారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని.. వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలిపారు. అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు.. ఈ సన్నివేశాలలో పవన్ కల్యాణ్‌తో పాటు 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారని సమాచారం.

ఈ సినిమాలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో మెరుస్తున్నారు. అద్భుతమైన టీజర్‌ను త్వరలోనే ప్రేక్షకుల ముందు ఉంచుతామని.. అభిమానుల కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇస్తామని యువ దర్శకుడు జ్యోతి కృష్ణ చెబుతున్నారు. మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు, తోట తరణి అద్భుతమైన సెట్‌లను రూపొందించారని సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ సినిమాను భారీస్థాయిలో నిర్మిస్తున్న వియం తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2025 మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం శ్రమిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x