OTT Platforms: కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఓటీటీలకు ప్రాధాన్యత పెరిగింది. ప్రేక్షకులు కూడా థియేటర్ కంటే ఓటీటీలనే ఆశ్రయిస్తుండటంతో ఓటీటీల్లో పోటీ పెరిగింది. ఆఫర్లు, సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
కరోనా ప్రభావం తగ్గి..థియేటర్లు యధాతథంగా తెర్చుకున్నా జనం మాత్రం ఓటీటీలు వీడటం లేదు. ఓటీటీలు ఈ రెండేళ్లలో ప్రేక్షకులు అంతగా అలవాటు పడిపోయారు. ఈ క్రమంలో వివిధ ఓటీటీ వేదికలు ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు, నిలబెట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు , ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ఓటీటీ వేదిక ఆహా...40 సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ముందుకొచ్చింది. అటు జీ5 ఏకంగా 80 కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రవేశపెట్టింది. అటు అమెజాన్ ప్రైమ్ కూడా 40 కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చింది మొత్తానికి ఓటీటీలు పోటీ పడి కొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు స్ట్రీమ్ చేస్తున్నాయి.
స్పెషల్ షోలు, వెబ్‌సిరీస్‌లు, కొత్త సినిమాలతో ప్రేక్షకుడికి కావల్సిన వినోదాన్ని అందించడం ద్వారా వ్యూయర్ షిప్ పెంచుకునేందుకు, సబ్‌స్క్రిప్షన్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వేసవి వెకేషన్‌లో ఆడియన్స్ ఇతర ఓటీటీలను ఆశ్రయించకుండా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనకొండ, బ్యాడ్‌బాయ్స్ 2, ఛార్లీస్ ఏంజెల్స్, మెన్ ఇన్ బ్లాక్, స్పైడర్ మ్యాన్, టెర్మినేటర్, రెసిడెంట్ ఈవిల్, బ్లాక్ హాస్ డౌన్ వంటి హాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు ఇండియన్ ఐడల్ షోలు ఆహాలో స్ట్రీమ్ అవుతుంటే..అమెజాన్ ప్రైమ్ కూడా అదే స్థాయిలో పోటీ పడుతోంది. ఇటీవలే కొత్తగా 40 వెబ్‌సిరీస్‌లు, సినిమాలు అందించనున్నట్టు ప్రకటించింది.
మరోవైపు జీ5 కూడా అన్ని భాషల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. 80 వరకూ సినిమాలు, వెబ్‌సిరీస్‌లను పాన్ ఇండియా స్థాయిలో స్ట్రీమింగ్ చేయనుంది. ఇందులో 40 వరకూ ఒరిజినల్ షోలుంటే..మరో 40 సినిమాలున్నాయి. ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. బిగ్‌బాస్ ఓటీటీ ఇప్పటికే ప్రధాన ఆకర్షణగా ఉండగా..ఐపీఎల్ 2022 ప్రత్యక్ష ప్రసారం మరో ఆకర్షణగా ఉంది. త్వరలో ఆర్ఆర్ఆర్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
సగటు ప్రేక్షకుడు గతంతో అంటే కరోనా మహమ్మారికి ముందుతో పోలిస్తే..థియేటర్‌కు వెళ్లడం తగ్గిపోయింది. ఇక రానున్న రోజుల్లో పూర్తిగా తగ్గిపోనుందని తెలుస్తోంది. ఇంట్లో ఉండి..వీలైనప్పుడల్లా సావకాశంగా సినిమా చూసే అవకాశమున్నప్పుడు...సమయం, డబ్బులు వెచ్చించి థియేటర్‌కు వెళ్లడం అవసరమా అనే ప్రశ్న వస్తోంది. ప్రేక్షకుడిలో మారుతున్న ఈ వైఖరి..రానున్న రోజుల్లో ఓటీటీలకు మరింత ఆదరణ పెరగవచ్చని తెలుస్తోంది.
Also read: Viral Video: ఈ ఆంటీ చాలా స్మార్ట్ గురూ.. పక్కనే ఉండి చాకచక్యంగా ఫోన్‌ను కొట్టేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.