Comedian Ali : రంజాన్‌ స్పెషల్.. చిరుతో కమెడియన్ అలీ.. పిక్స్ వైరల్

Comedian Ali Celebrates Ramadan 2023 కమెడియన్ అలీ రంజాన్ సందర్భంగా చిరంజీవిని ప్రత్యేకంగా కలిశాడు. ఇప్పుడు అలీ చిరంజీవి కలిసి ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్‌ అభిమానులు మాత్రం ఈ ఫోటో మీద డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2023, 10:28 PM IST
  • టాలీవుడ్‌లో రంజాన్ సందడి
  • చిరంజీవి ఇంటికి వెళ్లిన అలీ
  • మెగాస్టార్‌తో అలీ పిక్స్ వైరల్
Comedian Ali : రంజాన్‌ స్పెషల్.. చిరుతో కమెడియన్ అలీ.. పిక్స్ వైరల్

Ali meets Chiranjeevi సినీ నటుడు.. వైకాపా నాయకుడు అలీ నేడు ఈద్‌-ఉల్‌-ఫితర్‌(రంజాన్‌) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు. షూటింగ్ లో ఉన్న మెగాస్టార్‌ ను అలీ కుటుంబ సభ్యులు మొత్తం వెళ్లి కలవడం జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రంజాన్‌ పర్వదినాన్ని మెగాస్టార్ చిరంజీవితో కలిసి జరుపుకోవడం జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ అలీ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

చిరంజీవిని కలిసి వారిలో అలీతో పాటు ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. చిరంజీవి షూటింగ్ కి సంబంధించిన కాస్ట్యూమ్స్ లోనే ఉన్నాడు. అలీ రంజాన్ స్పెషల్‌ గా తన కుటుంబ సభ్యులు చేసిన వంటకాలను మెగాస్టార్ చిరంజీవి కి అందించడంతో పాటు ఆశీస్సులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రంజాన్‌ పర్వదినంను జరుపుకునేందుకు చిరంజీవి స్వయంగా అలీ కుటుంబ సభ్యులను ఆహ్వానించాడని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవిని ఈ రంజాన్ సందర్భంగా అలీ కుటుంబ సభ్యులు కలవడంతో చాలా సంతోషం వ్యక్తం చేశారు.

ఇక రాజకీయాల్లో క్రియాశీలకం అయ్యేందుకు అలీ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే వైకాపాలో జాయిన్ అయ్యి ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారుడి పదవిలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది జరగబోతున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏదో ఒక చోటు నుండి అలీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలోనే అలీ పోటీ చేయాలని భావించాడు. కానీ ఆయనకు ఛాన్స్ దక్కలేదు. ఈసారి అయినా జగన్ అలీకి పోటీ చేసే అవకాశం ఇస్తాడా అనేది చూడాలి. 

Also Read:  Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక

గత ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకున్న అలీకి జగన్ మొండి చేయి చూపించాడని.. దాంతో అలీ మరో పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది. కానీ అలీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైకాపా ను వీడేది లేదు అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలీ గత ఎన్నికల సమయంలో ప్రచారం చేసి పార్టీ విజయంలో తన వంతు కృషి చేసినందుకు గాను ప్రభుత్వ సలహాదారు పదవి ని కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో అలీకి సీటు దక్కకుంటే వైకాపా లో ఉంటాడా లేదా అనేది చూడాలి. పవన్‌ కు అత్యంత ఆప్తుడిగా పేరున్న అలీ జనసేన పార్టీలో జాయిన్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు దూరంగా ఉంటారు.. ఇలా చిరంజీవిని కలుస్తారంటూ జన సైనికులు మండిపడుతున్నారు.

Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x