Bigg Boss 4: బిగ్ బాస్ 4 లో ఫేమస్ కొరియోగ్రాఫర్ ?

బిగ్ బాస్ మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని త్వరలోనే 4వ సీజన్ ( Bigg Boss 4)లో అడుగుపెట్టబోతోంది. 15 మంది కంటెస్టెంట్స్‌తో 105 రోజుల పాటు జరిగే ఈ రియాలిటీ షోకు అక్కినేని నాగార్జున ( Nagarjuna akkineni ) హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.

Last Updated : Aug 19, 2020, 12:15 AM IST
Bigg Boss 4: బిగ్ బాస్ 4 లో ఫేమస్ కొరియోగ్రాఫర్ ?

బిగ్ బాస్ మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని త్వరలోనే 4వ సీజన్ ( Bigg Boss 4)లో అడుగుపెట్టబోతోంది. 15 మంది కంటెస్టెంట్స్‌తో 105 రోజుల పాటు జరిగే ఈ రియాలిటీ షోకు అక్కినేని నాగార్జున ( Nagarjuna akkineni ) హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. జూన్ చివరి వారంలోనే ప్రారంభం కావలసిన ఈ షో కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది. జూలై 20న నిర్వాహకులు బిగ్ బాస్ 4 లోగోను ఆవిష్కరించగా.. తాజాగా బిగ్ బాస్ 4 టీజర్‌ని ( Bigg Boss 4 teaser ) కూడా విడుదల చేశారు. ఇప్పటికే ఈ షో ప్రీ-ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ 4 రియాలిటీ షో కోసం అద్భుతమైన బిగ్ బాస్ హౌజ్ ( Bigg boss house ) దిద్దుకుంటోంది. Also read : Surekha Vani: కనిపించిన ప్రతీ మగాడితో అఫైర్స్ అంటగడుతున్నారని నటి ఆవేదన

ఐతే ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ ( Bigg Boss 4 Telugu contestants ) ఎవరు అనే విషయాన్ని బిగ్ బాస్ టీం ఎప్పటిలాగే అత్యంత గోప్యంగా ఉంచుతోంది. కాని ఆ 15 మంది ఎవరెవరా అనే ఊహాగానాలు కూడా అంతే వైరల్ అవుతున్నాయి. తాజాగా అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన టాక్ ప్రకారం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( Jani Master in Bigg Boss 4 ) బిగ్ బాస్ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌లో ఒకరు అని తెలుస్తోంది. గత సంవత్సరం, ప్రముఖ కొరియోగ్రాఫర్, బాబా మాస్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ సంవత్సరం, 4వ సీజన్లో నాగార్జున హోస్ట్ చేయబోయే ఈ షో కోసం బిగ్ బాస్ 4 నిర్వాహకులు జానీ మాస్టర్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. Also read : Vakeel Saab teaser: వకీల్ సాబ్ టీజర్‌కి ముహూర్తం ఖాయం ?

Trending News