Waltair Veerayya Song Shoot మెగాస్టార్ చిరంజీవి, శ్రుతి హాసన్ కాంబినేషనలో రాబోతోన్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. మాస్ బీట్స్‌తో చిరంజీవి స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే అని మొదటి నుంచి చెబుతూనే ఉంది చిత్రయూనిట్. ఈ క్రమంలో వచ్చిన బాస్ పార్టీ పాటకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ పాట స్లో పాయిజన్‌లా ఎక్కేస్తుందని, రాను రాను అదే ట్రెండీగా మారుతుందని అంతా అంటున్నారు.
ఇప్పుడు బాస్ పార్టీ అయితే పై చేయి సాధించింది. తమన్ కొట్టిన జై బాలయ్య పాట బోల్తా పడింది. ఒసేయ్ రాములమ్మ పాటను కాపీ కొట్టేసి జై బాలయ్య మార్చడంతో జనాలు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య మంచి ట్రెండింగ్లో ఉంది. తాజాగా వాల్తేరు వీరయ్య గురించి ఓ అప్డేట్ వచ్చింది.
అసలే సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రయూనిట్ తెగ కష్టపడుతోంది. డిసెంబరు 15 నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలన్నది వారి ఆలోచన. ఇప్పుడు ఓ రెండు పాటలను షూట్ చేసే క్రమంలో ఈ టీమ్ ప్రాన్స్ వెళ్తోందని తెలుస్తోంది. డిసెంబరు 1న చిరు ఫ్రాన్స్‌లో ఉంటాడని సమాచారాం.
అక్కడే ఓ పది రోజుల పాటు షూటింగ్ జరగబోతోందట. తిరిగి వచ్చిన తరువాత మిగిలిన పనులేమైనా ఉంటే చేసేస్తారట. డిసెంబరు చివరి వారంలో ప్రమోషన్లు మొదలు పెడతారని తెలుస్తోంది. అయితే వాల్తేరు వీరయ్య కోసం దేవీ శ్రీ ప్రసాద్ కొట్టిన పాటల మీద మాత్రం అందరికీ అనుమానం మొదలైంది.
నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సిసిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని జనాలు పోల్చుతున్నారు. పాటలు, పోస్టర్లు, టీజర్లు ఇలా ప్రతీ ఒక్క విషయాన్ని కూడా పోల్చి చూస్తున్నారు. మెగా వర్సెస్ నందమూరి అభిమాలను మధ్య రాను రాను మరింతగా గొడవలు జరిగేట్టు కనిపిస్తోంది.
Also Read : Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చేసిన ప్రభాకర్, శివ బాలాజీ
Also Read : Vishnu Vishal Ravi Teja : కథ ఇవ్వమని రవితేజ అడిగినా నో అని చెప్పా : విష్ణు విశాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook