Chiranjeevi - Pawan Kalyan: ఒకే స్టేజ్‌పై చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌.. అభిమానులకు పండగే ఇగ!

Pawan Kalyan will Chief Guest of Chiranjeevi's Godfather Movie. 'గాడ్‌ ఫాదర్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా రానున్నారని సమాచారం తెలుస్తోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 7, 2022, 04:29 PM IST
  • ఒకే స్టేజ్‌పై చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌
  • అభిమానులకు పండగే ఇగ
  • కీలక పాత్రలో సల్మాన్ ఖాన్
Chiranjeevi - Pawan Kalyan: ఒకే స్టేజ్‌పై చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌.. అభిమానులకు పండగే ఇగ!

Pawan Kalyan is Chief Guest for Chiranjeevis Godfather Movie Pre Release Event: 'మెగాస్టార్‌' చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'గాడ్‌ ఫాదర్‌'. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన 'లూసిఫర్‌' సినిమాకు రీమేక్‌గా గాడ్‌ ఫాదర్‌ వస్తోంది. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజకీయ కథాంశంతో సిద్ధమవుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గాడ్‌ ఫాదర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ భారీగా సన్నాహాలు చేస్తోంది. 

'గాడ్‌ ఫాదర్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా రానున్నారని సమాచారం తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ఇప్పటికే చిత్ర యూనిట్ పవన్‌ను సంప్రదించగా.. ఆయన సుముఖత వ్యక్తం చేశారట. ఇదే నిజం అయితే చాలా రోజుల తర్వాత  ఒకే స్టేజ్‌పై చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ సందడి చేయనున్నారు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

'గాడ్‌ ఫాదర్‌' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక టీజర్ అయితే సినిమాపై అంచనాలను మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. ఇక ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఉంది. మెగాస్టార్ సరసన నయనతార నటించనుండగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, హీరో సత్య దేవ్, కమెడియన్ సునీల్ ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. 

Also Read: షమీ ఇంట్లో కూర్చోవడం ఆశ్చర్యంగా ఉంది.. జట్టు ఎంపికపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఫైర్!

Also Read: నిఖిల్‌కు నితిన్‌కు ఆ మాత్రం తేడా కూడా తెలియట్లేదా నాయనా.. బీజేపీ లీడర్లను ఆటాడుకుంటున్న నెటిజన్లు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News