Chiranjeevi Breakfast : బ్రేక్ ఫాస్ట్‌లో చిరంజీవి తినేది ఇదేనా? అంతేనా?.. ఫోటో తీసిన సురేఖ కొణిదెల

Chiranjeevi Breakfast చిరంజీవి ఆదివారం నాడు దేవీ శ్రీ ప్రసాద్‌ను ఇంటికి పిలిపించినట్టున్నాడు. చిరంజీవి ఇలా స్పెషల్‌గా పిలిచి మరీ బ్రేక్ ఫాస్ట్ ఆఫర్ చేసినట్టుగా కనిపిస్తోంది. కారణం ఏంటి? సందర్భం ఏంటి అన్నది మాత్రం క్లారిటీగా తెలియడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2023, 11:45 AM IST
  • బ్రేక్ ఫాస్ట్‌ కోసం చిరు ఇంటికి దేవి శ్రీ ప్రసాద్
  • టిఫిన్స్‌లో చిరంజీవి తినేది ఏంటంటే?
  • చిరు డీఎస్పీల ఫోటో తీసిన సురేఖ కొణిదెల
Chiranjeevi Breakfast : బ్రేక్ ఫాస్ట్‌లో చిరంజీవి తినేది ఇదేనా? అంతేనా?.. ఫోటో తీసిన సురేఖ కొణిదెల

Chiranjeevi Breakfast మెగాస్టార్ చిరంజీవికి దేవీ శ్రీ ప్రసాద్‌కు ఉన్న రిలేషన్ అందరికీ తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తితో చిరంజీవికి ఉన్న అనుబంధం తెలిసిందే. చిన్నతనంలో దేవీ శ్రీ ప్రసాద్‌ను టాలెంట్‌ను మొదటగా గుర్తించింది కూడా చిరంజీవే. ఆ టైంలోనే చిరంజీవి డీఎస్పీకి ఓ వాచ్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడట. సంగీత దర్శకుడిగా చిరంజీవికి మెమెరబుల్ హిట్స్ ఇచ్చాడు దేవీ శ్రీ ప్రసాద్. వీరిద్దరి కాంబో అంటూ మెగాఫ్యాన్స్‌కు పండుగే. చివరగా వాల్తేరు వీరయ్యతో చిరంజీవి మీద ప్రేమను చూపించాడు డీఎస్పీ.

చిరంజీవి దేవీ శ్రీ ప్రసాద్ కలిసి టిఫిన్ చేస్తూ ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సండే ఇలా డీఎస్పీ బ్రేక్ ఫాస్ట్ ఎంతో సంతోషంగా జరిగిందని చెప్పుకొచ్చాడు. బ్రేక్ ఫాస్ట్ విత్ ది బాస్.. అమెజింగ్ టైం ఇచ్చి.. అంత మంచి బ్రేక్ ఫాస్ట్ పెట్టించిన డియర్ చిరంజీవి సర్‌కు థాంక్స్.. ఈ ఫోటోను తీసిన సురేఖ గారికి థాంక్స్ అంటూ డీఎస్పీ ట్వీట్ వేశాడు.

 

ఇక ఈ ట్వీట్ మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చిరంజీవి తినే టిఫిన్స్ మీద కామెంట్లు చేస్తున్నారు. ఒక పూరినే తింటాడా? తక్కువగా తింటాడా? పూరి కోసమే ఇన్ని కూరలు, చట్నీలా అంటూ మరికొందరు ట్వీట్లు పెడుతున్నారు. ఏదైనా సినిమా చాన్స్ కోసం, తన సినిమాకు సంగీతం కొట్టమని డీఎస్పీని చిరంజీవి పిలిచాడంటూ ఇంకా కొందరు కామెంట్లు చేయడం లేదేంటి? అని యాంటి ఫ్యాన్స్ మీద మెగా ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు.

Also Read:  Urvashi Rautela : ఊర్వశీ రౌతేలాకు అఖిల్ అక్కినేని వేధింపులు?.. చిర్రెత్తుకొచ్చి కేసు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ

డీఎస్పీ, తమన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తమన్‌కు ఇప్పుడు టాప్ పొజిషన్‌ ఉంది. డీఎస్పీ కాస్త రేసులో వెనకపడ్డట్టు కనిపిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ చివరగా వాల్తేరు వీరయ్య సినిమాతో మెప్పించాడు. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా కూడా పుష్ప రెండో పార్ట్ మీదే పెట్టేశాడు. ఈ సినిమా పాటల మీద అందరికీ భారీ అంచనాలున్నాయన్న విషయం తెలిసిందే.

Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News