Chiranjeevi - Amitabh Bachchan : గురువు అంటూ చిరు.. లెజెండ్ అంటూ రజినీ.. అమితాబ్ మీద ట్వీట్ల వర్షం

Amitabh Bachchan Turns 80 అమితాబ్ బచ్చన్ 80వ జన్మదినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ట్విట్టర్ మొత్తం అమితాబ్ జపం చేస్తున్నట్టుగా మారింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 01:36 PM IST
Chiranjeevi - Amitabh Bachchan : గురువు అంటూ చిరు.. లెజెండ్ అంటూ రజినీ.. అమితాబ్ మీద ట్వీట్ల వర్షం

HBD Amitabh Bachchan : బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 80వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోతోంది. బాలీవుడ్ ప్రముఖ హీరోలు, ప్రొడక్షన్ కంపెనీలు, దర్శక నిర్మాతలంతా కూడా అమితాబ్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే బాలీవుడ్ మెగాస్టార్ కోసం టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలు ట్వీట్లు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా అమితాబ్‌కు మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ఆల్రెడీ అమితాబ్‌కు విషెస్ చెబుతూ ట్వీట్ వేశాడు.

 

తాజాగా చిరంజీవి బిగ్ బీ మీద ట్వీట్ వేశాడు. ' నా ప్రియమైన గురూజీకి 80వ పుట్టిన రోజు శుభాకాంక్షలు.. మీరెప్పుడూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలి.. మీరు మా ఆర్టిస్టులందరిలో ఎవరెస్ట్ వంటి వారు.. మీ సమకాలీకులమైనందుకు గర్వపడుతుంటారు.. మిమ్మల్ని చూసి ఎప్పుడూ ఆశ్చర్యానికి లోనవుతుంటాం.. మీకు ఆ భగవంతుడు మరింత శక్తిని అందించాలి అమిత్ గారు'అంటూ చిరు ట్వీట్ వేశాడు.

 

తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం అమితాబ్‌కు విషెస్ అందించాడు. ' నన్ను ఎప్పుడూ ఇన్ స్పైర్ చేసే లెజెండ్.. 80వ దశకం నుంచి మన ఇండియన్ సినిమాకు సూపర్ హీరోగా అందరినీ మెప్పిస్తూనే ఉన్నారు.. అలాంటి అమితాబ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.' అని రజినీకాంత్ ట్వీట్ వేశాడు.

ప్రస్తుతం అమితాబ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. బుల్లితెరపై కేబీసీ షోతో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా బిగ్ బీ.. గుడ్ బై అనే చిత్రంలో కనిపించాడు. ఇందులో రష్మిక మందాన్న ఓ ముఖ్య పాత్రను పోషించింది. ఈ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా జనాలను మెప్పించింది. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని మాత్రం నమోదు చేయలేకపోయింది.

Also Read : GarikaPati - Chiranjeevi : అదృష్టం కొద్దీ చిరంజీవి అధికారంలోకి రాలేదు : గరికపాటి

Also Read : HBD Amitabh Bachchan : సవాళ్లకు ఎదురీదిన అమితాబ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News