VD 14: విజయ్ దేవరకొండతో నటించాలని ఉందా.. వెంటనే ఈ పని చేయండి..

VD 14:  మీకు సినిమా ఆసక్తిగా ఉందా.. అందులో స్టార్ హీరో విజయ్ దేవరకొండతో నటించాలని ఉందా.. ! వెంటనే ఈ పని చేయండి. తాజాగా ఈయన హీరోగా నటిస్తన్న 14వ చిత్రంలో కొత్త నటీనటులను కావాలని ఓ ప్రకటన విడుదల చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 25, 2024, 04:29 PM IST
VD 14: విజయ్ దేవరకొండతో నటించాలని ఉందా.. వెంటనే ఈ పని చేయండి..

VD 14: విజయ్ దేరవకొండ గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. రీసెంట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ప్రేక్షకులను మెప్పించడంల విఫలమైంది. మరోవైపు విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ కోవలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 ఇటీవలే అనౌన్స్ అయ్యింది. తాజాగా ఈ సినిమా కోసం క్యాస్టింగ్ కాల్ అనైన్స్ చేసింది చిత్ర యూనిట్.  రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నారు.  పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీడీ 14 నుంచి తాజాగా  కాస్టింగ్ కాల్ ప్రకటన చేశారు. ఔత్సాహిక నటీనటులను ఎంపిక చేసి విజయ దేవరకొండ హీరోగా నటిస్తూన్న 14వ చిత్రంలో యాక్ట్ చేసే ఛాన్స్ కల్పించనున్నారు. 

తిరుపతి, అనంతపురం, కడప, కర్నూల్ లో జూలై 1వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ జరగనున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొత్తం రాయలసీమలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని నటులకు అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది.  నటనలో ప్రతిభ గల కొత్త టాలెంట్ కు ఇది గొప్ప అ‌వకాశం అని చెప్పుకోవచ్చు.

ఒక వీరుడి పోరాటాన్ని చూపిస్తూ 19వ సెంచరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు.  1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాహుల్ సంకృత్యన్. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తోన్న మూడో  సినిమా ఇది. 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ప్రేక్షకులకు ఒక ఎపిక్ లాంటి ఎక్సీపీరియన్స్ ఇవ్వనుందీ సినిమా. త్వరలో వీడీ 14 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు

Also read: IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News