Case Filed at Delhi High Court to give Stay on Adipursh: ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఇబ్బందుల్లో పడింది. ఈ సినిమా టీజర్ ను దసరా సందర్భంగా సినిమా యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ సినిమా టీజర్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆదిపురుష్ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాలో రాముడు, రావణుడి పాత్రలను చూపించిన విధానం కరెక్ట్ కాదని పిటిషనర్ పేర్కొన్నారు.
అలాగే ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు తోలుతో చేసిన దుస్తులు ధరించారన్న పిటిషనర్, రావణుడిని సైతం సరి అయిన విధంగా చిత్రీకరించలేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఓం రౌత్ రామాయణం ఆధారంగా రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆదిపురుష్' టీజర్ విడుదలైనప్పటి నుంచి వివాదాల్లో చిక్కుకుంది. మతాన్ని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ పలు హిందూ సంస్థలు ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశాయి.
గతవారం 'ఆదిపురుష' టీజర్ విడుదలవగా ఈ సినిమాలో రావణుడి పాత్రపై పలు విమర్శలు వచ్చాయి. ఈ పాత్రను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు, ఆయన రూపం వింతగా ఉండడగమే కాక కళ్లకు సుర్మా కూడా పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉండడంతో ఇది 'రామాయణం' ఇస్లామీకరణను ప్రతిబింబిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. హనుమంతుడు మీసాలు లేకుండా గడ్డంతో ఉండడం, దానికి తోడు ఆయన వస్త్రాన్ని తోలుతో ఉన్నట్టు చూపడంతో కొందరు ఇది కరెక్ట్ కాదని సినిమాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
దీంతో ఈ సినిమా టీజర్‌పై పలు రాజకీయ పార్టీలు, నాయకుల వర్గాలు విమర్శలు గుప్పించడంతో ఈ సినిమాకు కష్టాలు పెరుగుతున్నాయి. హిందువుల మతపరమైన పాత్రలను తప్పుగా చిత్రీకరించే సన్నివేశాలను తొలగించకుంటే లీగల్ నోటీసులు పంపుతామని మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తం మిశ్రా ఇప్పటికే 'ఆదిపురుష' చిత్ర నిర్మాతలను హెచ్చరించారు. ఇక ఇంతకు ముందు ‘ఆదిపురుష్’ టీజర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ న్యాయవాది జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రమోద్ పాండే అనే న్యాయవాది హిందూ దేవుళ్లను కించపరిచేలా టీజర్లో చూపించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలోని నటీనటులు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంపై లక్నో పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
Also Read: Godfather Collections: మూడు రోజులైనా ఖైదీ నెం.150 మొదటి రోజు కలెక్షన్స్ బీట్ చేయలేకపోయిన గాడ్ ఫాదర్!
Also Read: Sreeleela Mother: కుమార్తెకు తలనొప్పిగా మారిన శ్రీలీల తల్లి.. వరుస కేసులతో !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook