BVS Ravi Back to Back Movies as Actor: ఈ మధ్యకాలంలో దర్శకులు నటులుగా మారుతున్న దాఖలాలు ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు ఆ కోవలోకి మరో కొత్త దర్శకుడు వచ్చి చేరారు. మచ్చ రవిగా ఫేమస్ అయిన తెలుగు దర్శకుడు, స్క్రీన్ రైటర్ బివిఎస్ రవి కెరీర్ తొలినాళ్లలో పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేశారు. శివయ్య, సీతారామరాజు, ప్రేయసి రావే, స్నేహితులు, అయోధ్య రామయ్య, భద్రాచలం వంటి సినిమాలకు ఆయన పోసాని కృష్ణ మురళి అసిస్టెంట్ గా వ్యవహరించేవారు. తరువాత డైరెక్టర్ గా మారి గోపీచంద్ తో వాంటెడ్ అనే సినిమా చేసిన ఆయన తర్వాత సాయి ధరంతేజ్ తో జవాన్ అనే సినిమా చేశారు.
అయితే ఆ రెండు సినిమాలు బోల్తా పడ్డాయి. అయితే ఆ మధ్య ప్రొడ్యూసర్ గా కూడా సెకండ్ హ్యాండ్ అనే ఒక సినిమా చేసినా అది కూడా ఆయనకు కలిసి రాలేదు. అయితే అప్పుడెప్పుడో కేడి నెంబర్ వన్ అనే సినిమాతోనే నటుడిగా మారిన ఆయన తర్వాత శ్రావణమాసం, అయోధ్య, నాయుడమ్మ వంటి సినిమాల్లో కనిపించారు. ఇక క్రాక్ సినిమాలో పూర్తిస్థాయినటుడిగా మారిన బివిఎస్ రవి ఈ మధ్య కాలంలో అన్ని సినిమాల్లోనూ దర్శనమిస్తున్నారు. గత ఏడాది విడుదలైన ధమాకా సినిమాలో కమెడియన్ తరహా పాత్రలో కనిపించిన ఆయన వీర సింహారెడ్డి సినిమాలో కూడా అదే తరహా పాత్రలో కనిపించారు.
ఇదేంట్రా బాబు అని ఆశ్చర్య పోయే లోపు మరో సారి వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా దర్శనమిచ్చారు, ప్రస్తుతానికి ఆయన దర్శకుడిగా అంత బిజీగా లేకపోయినా స్క్రీన్ రైటర్ గా మాత్రం తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోకి స్క్రీన్ రైటర్ గా వ్యవహరిస్తున్న ఆయన నాగచైతన్య థాంక్యూ సినిమాకి కూడా స్క్రీన్ రైటర్ గా వ్యవహరించారు. రానా-వెంకటేష్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న రానా నాయుడు అనే నాగ్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ కి కూడా ఆయన స్క్రీన్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు.
దాదాపు నేటి తరంలో చాలామంది దర్శకులు ఆయనకు స్నేహితులు కావడంతో సరదాగా ఆయనను సినిమాల్లో నటింప చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే క్రాక్ సినిమా మినహా మిగతా సినిమాల్లో ఆయన కనిపించిన పాత్రలన్నీ చిన్నవే కాగా అవి కూడా కామెడీ తరహా పాత్రలు కావడం గమనార్హం. దీంతో ఆయన కమెడియన్ గా మారే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అంటూ కొందరు నెటిజన్లు సరదాగా సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తున్నారు.
Also Read: Kalyanam Kamaneeyam Movie Review : కళ్యాణం కమనీయం రివ్యూ.. సంతోష్ శోభన్ హిట్ కొట్టేశాడా?
Also Read: Dhamaka OTR Release: ఇక ఓటీటీలో ధమాకా సృష్టించనున్న మాస్ మహారాజా రవితేజ, ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook