BVK Vagdevi Wins AHA's Telugu Indian Idol 1 Title: కరోనా కంటే ముందే ఓటీటీలు తెలుగు వారికి కొంతవరకు దగ్గరైనా కరోనా లాక్ డౌన్ వాటిని మరింత దగ్గరయ్యేలా చేసింది. ఇక గత కొంత కాలంగా తెలుగులో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగులో అల్లు అరవింద్ ఆహా అనే ప్యూర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ మొదలెట్టిన విషయంత తెలిసిందే. ఈ ఓటీటీలో కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌ల వరకే పరిమితం కాకుండా కొన్ని స్పెషల్ షోలు చేస్తున్నారు. అందులో భాగంగా 'తెలుగు ఇండియన్ ఐడల్' అనే షో ప్రారంభించగా అది మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా మొదటి సీజన్ పూర్తవగా విన్నర్ కు చిరంజీవి బహుమతులు అందించారు.
హిందీలో సక్సెస్ అయిన ఇండియన్ ఐడల్ కు తెలుగు వర్షన్ గా రూపొందిన ఈ 'తెలుగు ఇండియన్ ఐడల్'కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యా మీనన్, ప్రముఖ సింగర్ కార్తీక్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీరామచంద్ర హోస్ట్ చేస్తున్న ఈ షోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. షోకి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని ఎపిసోడ్స్ ను సెలబ్రిటీ స్పెషల్స్ గా ప్లాన్ చేయగా అవి మరింత హిట్ అయ్యాయి. ఇక 'తెలుగు ఇండియన్ ఐడల్' ఫినాలేలో టైటిల్ కోసం ఐదుగురు కంటెస్టెంట్లు శ్రీనివాస్, జయంత్, వాగ్దేవి, ప్రణతి, వైష్ణవిలు పోటీ పడ్డారు.
ఎవరికి వారు ఫినాలేలో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నా జూనియర్ పూజా హెగ్డేగా గుర్తింపు పొందిన బీవీకే వాగ్దేవి మొదటి సీజేఎం విజేతగా నిలిచింది. ఆమె పేరును ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఈ ఫినాలే ఎపిసోడ్ ప్రస్తుత్తం స్ట్రీమ్ అవుతోంది. అయితే ప్రైజ్ ప్రకటించక ముందే వాగ్దేవి పాడిన 'ఆట కావాలా పాట కావాలా' అనే పాటకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. దీంతో త్వరలోనే నీ పాటకు నేను హీరోయిన్ తో డాన్స్ చేసే అవకాశం తొందర్లోనే వస్తుంది అని తన సినిమాలో పాడే అవకాశం గురించి పరోక్షంగా హింట్ ఇచ్చారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి వాగ్దేవి గురించి ప్రత్యేకంగా ఒక చిలిపి కవిత్వం కూడా చదివి వినిపించారు.
డియర్ వాగ్దేవి నువ్వు నా మనసులో జూనియర్ పూజా హెగ్డేవి అంటూనే ఇది నేను రాయలేదు అని సరదాగా చెప్పానని అన్నారు. ఇక 'తెలుగు ఇండియన్ ఐడల్' మొదటి సీజన్‌లో విజేతగా నిలిచిన బీవీకే వాగ్దేవికి రూ. 10 లక్షలు ప్రైజ్‌మనీ, స్పాన్సర్స్ నుంచి మరో రూ. 6 లక్షలు డబ్బు లభించాయి. షోలో మొదటి రన్నరప్‌గా శ్రీనివాస్, రెండో రన్నరప్‌గా వైష్ణవి ఎంపికైంది. ఇక వాగ్దేవికి మెగాస్టార్ చిరంజీవి సినిమా ఛాన్స్ ఇవ్వగా, ఆమెకు గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో పాడే అవకాశం కూడా దక్కింది. ఇక సెకెండ్ రన్నరప్‌గా నిలిచిన వైష్ణవికి కూడా చిరంజీవి తన తదుపరి చిత్రం 'భోళా శంకర్'లో పాట పాడే అవకాశం కల్పించారు.
Also Read:Allu Aravind & Balaiah: అల్లు అరవింద్-బాలయ్యలది ఫెవికాల్ బంధం మరి..ఆహా వేదికపై బాలకృష్ణ
ALso Read: Indian Idol: తెలుగులో ఇండియన్ ఐడల్, న్యాయ నిర్ణేతగా తమన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.