/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

Sai dharm tej at  Indrakeeladri: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో'మూవీ (Bro Movie) బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. మిక్సడ్ టాక్ వచ్చిన కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ నేపథ్యంలో బ్రో మూవీ విజయోత్సవాలను నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగా మూవీ టీమ్ అంతా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. చిత్రయూనిట్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం వీరికి పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు.  అంతేకాకుండా అమ్మవారి చిత్రపటంతోపాటు ప్రసాదం కూడా అందించారు. 

మామాల్లుళ్లు అయిన పవన్, సాయితేజ్ సిల్వర్ స్క్రీన్ ను షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ మూవీకి నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. కేతిక శర్మ, ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. జూలై 28న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. పవన్ మేనియా కారణంగా అడియెన్స్ థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. ఈ సినిమాలో సాయి తేజ్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. మిగతా నటీనటులు కూడా వారి పాత్రల మేరకు బాగానే చేశారు. ఈ సినిమాపై విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్ల వర్షం మాత్రం ఆగడం లేదు. ఇదే జోరు కొనసాగితే మరో రెండు బ్రో మూవీ రూ.150 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 

Also Read: August Releases: ఆగస్టులో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. సూపర్ స్టార్ తో పోటీపడుతున్న మెగా హీరోలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Bro Movie unit including Sai dharm tej visit kanaka durgamma temple at Vijayawada
News Source: 
Home Title: 

దుర్గమ్మ సేవలో 'బ్రో' చిత్ర యూనిట్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సాయి తేజ్..

Indrakeeladri: దుర్గమ్మ సేవలో 'బ్రో' చిత్ర యూనిట్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సాయి తేజ్..
Caption: 
image (twitter)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
దుర్గమ్మ సేవలో 'బ్రో' చిత్ర యూనిట్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సాయి తేజ్..
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, August 1, 2023 - 16:03
Created By: 
Srinivas Samala
Updated By: 
Srinivas Samala
Published By: 
Srinivas Samala
Request Count: 
22
Is Breaking News: 
No
Word Count: 
225