Netizens trolls Mahesh Babu over Bollywood can't afford me Statement: టాలీవుడ్ 'సూపర్ స్టార్' మహేష్ బాబు ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడగ్గా.. బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి తనకు ఆసక్తి లేదని, తన సమయాన్ని వృథా చేసుకోదలుచుకోలేదన్నారు. ఇక తనని బాలీవుడ్ భరించలేదని కూడా మహేష్ అన్నారు. సూపర్ స్టార్ వ్యాఖ్యలపై బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగింది. బాలీవుడ్ ప్రముఖులు కొందరు మహేష్ వ్యాఖ్యలను తప్పుబడుతుంటే.. మరికొందరు మాత్రం మద్దతుగా నిలిచారు.
ప్రస్తుతం మహేష్ బాబు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. పాన్ మసాలా బ్రాండ్ 'పాన్ బాహర్'కు సూపర్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌లో కలిసి పాన్ బాహర్ పొగాకు బ్రాండ్‌ను మహేష్ ప్రోమోట్ చేస్తున్నాడు. బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకున్న కొందరు నెటిజన్లు.. పొగాకు బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నందుకు మహేష్ బాబుపై ట్రోల్స్ చేస్తున్నారు. నెట్టింట బాబుపై కామెంట్స్ చేయడమే కాకుండా.. మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
'బాలీవుడ్ తనను భరించలేదని మహేష్ బాబు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కానీ ఒక పాన్ మసాలా బ్రాండ్ మాత్రం అతడిని భరిస్తుందా?' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'మహేష్ బాబు వంటి టాలీవుడ్ స్టార్‌లు మాత్రమే పాన్ మసాలా ఉత్పత్తులను విక్రయించడానికి అర్హులు అని నేను అనుకుంటాను' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేష్ ఫాన్స్ వారిపై మండిపడుతున్నారు. ఇటీవల అక్షయ్ కుమార్ కూడా పొగాకు బ్రాండ్‌ను ప్రచారం చేసినందుకు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు.
A Pan Masala Company Can Afford @urstrulyMahesh but Bollywood Cannot 🤣🤣
— Sourav Gupta (@SouravGupta09) May 14, 2022
46 ఏళ్ల మహేష్ బాబు 1989లో తన తండ్రి కృష్ణ చిత్రం 'పోరాటం'లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి ఇండస్ట్రీలోకి వచ్చారు. 1999లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆపై అనతి కాలంలోనే స్టార్ హీరో అయ్యాడు. మురారి, ఒక్కడు సినిమాలతో స్టార్ అయ్యాడు. ఆపై అతడు, పోకిరి, బిజినెస్ మ్యాన్, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల విదులైన 'సర్కారు వారి పాట' సినిమా కూడా భారీ హిట్ కొట్టింది.
@urstrulyMahesh bollywood can't afford u but pan masala brand does 🤭😂😂 pic.twitter.com/CI7Lkqij1d
— SAMBIT ASH 🇮🇳 (@SAMBITASH2) May 11, 2022
It's funny how #MaheshBabu said that #Bollywood can't afford him. But a pan masala brand can ( he endorses Pan Bahar and having a Bollywood equivalent in Tiger shroff). Nothing wrong with it. But next time onwards, bring a better arguement to act that Elite. pic.twitter.com/JkDGDBmpUC
— Shikhar Sinha (@pairgame) May 15, 2022
I assume only TFI stars like #MaheshBabu are allowed to sell Pan Masala products, while the rest are abused for doing the same. Nice double standards😒 @Its_CineHub
#SarkaruVaariPaata #SVP #PrithvirajChauhan pic.twitter.com/ymuv2Vw1oi— J.P.S (@TheJ_P_S) May 12, 2022
Also Read: Kcr On Dalitha Bandhu: దళిత బంధుపై కేసీఆర్ సంచలన నిర్ణయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.