actress Priyanka chopra visited gadikota kamineni temple: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల వరుస ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవల హైదారబాద్ లో ప్రసిద్ది చెందిన చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు. ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. నటి ప్రియాంక చోప్రా ఇటీవల రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కనున్న ఎస్ఎస్ఎంబీ-29 సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో పాల్గొనేందుకే ఆమె హైదరాబాద్ కు వచ్చారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. దాదాపు.. ప్రియాంక చోప్రా ఐదేళ్ల తర్వాత ప్రియాంకచోప్రా ఎస్ఎస్ఎంబీ-29 లో నటిస్తున్నారు.
Priyanka Chopra shares glimpses of early morning temple visit in Hyderabad, fuels rumours about signing Rajamouli's next@priyankachopra #priyankachopra #SSRajamouli #hyderabad #peecee https://t.co/ERRokjCeZe pic.twitter.com/OIP8x58n3G
— HT City (@htcity) January 24, 2025
ఇదిలా ఉండగా..దోమకొండ మండలం గడికోట మహాదేవుడి ఆలయాన్ని ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు.తన కారులో ఉదయం హైదరబాద్ నుంచి దోమకొండకు నటి చేరుకున్నారు. గడికోటకి వచ్చిన బాలీవుడ్ నటికి ట్రస్ట్ సభ్యులు, ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు.
కామినేని వంశీయులకు ఈ కోట చెందినది. అయితే.. ఇప్పటికే ఉపాసన కామినేని చిల్కూరులో ప్రియాంకకు స్వామివారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మరోసారి కామినేని వంశీయులకు చెందిన ఆలయంను ప్రియాంక చోప్రా దర్శించు కొవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, గడికోటకు వచ్చిన ప్రియాంక అందుకు సంబంధించిన వీడియోను ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter