Jr Ntr Movie: కొరటాల శివ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్

Jr Ntr Movie: జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ఓ వైపు బుల్లితెరపై..మరోవైపు వెండితెరపై. ఆర్ఆర్ఆర్ తరువాత కొరటాల శివతో మరోసారి తెరకెక్కనున్నాడు. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 16, 2021, 04:14 PM IST
  • కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ ఎవరు
  • జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్
  • టాలీవుడ్‌లో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న అప్‌డేట్
Jr Ntr Movie: కొరటాల శివ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్

Jr Ntr Movie: జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ఓ వైపు బుల్లితెరపై..మరోవైపు వెండితెరపై. ఆర్ఆర్ఆర్ తరువాత కొరటాల శివతో మరోసారి తెరకెక్కనున్నాడు. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్‌లో యంగ్ టైగర్‌గా జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)అలియాస్ తారక్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్‌లో రామ్‌చరణ్‌తో కలిసి బిజీగా ఉన్న ఎన్టీఆర్..బుల్లితెరను కూడా వదల్లేదు. మీలో ఎవరు కోటీశ్వరుడంటూ ప్రశ్నలు కురిపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్‌లో లీడ్ రోల్ పోషిస్తున్న తారక్..మరో సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తయి..పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో ధియేటర్లలో విడుదల చేయాలని గతంలో నిర్ణయించినా ఆ తరువాత వాయిదా పడింది. ఎప్పుడు విడుదలయ్యేది ఇంకా తేదీ ఖరారు కాలేదు. 

ఇక ఈ సినిమా తరువాత ప్రముఖ మాస్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva)తో కలిసి తెరకెక్కనున్నాడు తారక్. ఇప్పటికీ ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీ అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకెళ్లనుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎవరు నటించనున్నారనేది ఇప్పటి వరకూ తేలలేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ అప్‌డేట్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో(RRR Movie) రామ్‌చరణ్‌కు జోడీగా అలియా భట్(Alia Bhatt) నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే ఆలియా భట్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కొరటాల శివ తెరకెక్కించనున్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కన్పించనున్నాడు. పలువురు టాలీవుడ్ హీరోలు కూడా ఈ సినిమాలో కన్పించనున్నట్టు సమాచారం. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో సినిమా రానుంది. ఏప్రిల్ 29, 2022న సినిమా విడుదల చేస్తామని ముందే ప్రకటించేశారు. ప్రస్తుత ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Also read: Guduputani trailer: గూడుపుఠాణి ట్రైలర్.. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన Raghu Kunche

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News