Bigg Boss Telugu 6: ఇనాయా అవుట్, బుధవారం మరో ఎలిమినేషన్, గ్రాండ్ ఫినాలే ఎప్పుడంటే

Bigg Boss Telugu 6: అందరూ ఊహించిందే జరిగింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న ఇనాయా ఎలిమినేట్ అయింది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 గ్రాంఢ్ ఫినాలేకు కేవలం ఒక్క అడుగు దూరంలో ఇనాయా జర్నీ ముగిసింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 11, 2022, 11:36 PM IST
Bigg Boss Telugu 6: ఇనాయా అవుట్, బుధవారం మరో ఎలిమినేషన్, గ్రాండ్ ఫినాలే ఎప్పుడంటే

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 దాదాపు చివరికొచ్చేసింది. ఇక గ్రాండ్ ఫినాలే మాత్రమే మిగిలింది. చివరి వారంలో ఊహించని పరిణామం. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భావించిన ఇనాయా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. 

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 గ్రాండ్ ఫినాలే సమీపిస్తోంది. హౌస్‌లో లేడీ డాన్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా..స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా టాప్ 3లో కచ్చితంగా ఉంటుందని భావించిన ఇనాయా సుల్తానా ఈ వారం ఎలిమినేట్ అయింది. గ్రాండ్ ఫినాలేకు కేవలం ఒక్క అడుగు దూరంలో జర్నీ ముగించుకుంది. జర్నీ చివర్లో కెప్టెన్ అవడమే కాకుండా అందరితో బెస్ట్ కెప్టెన్ అన్పించుకున్న ఇనాయా కచ్చితంగా టాప్ 3లో ఉంటుందని అందరూ భావించారు. 

కానీ ఇనాయా ఈ వారం ఎలిమినేట్ అవుతుందనే వార్త లీక్ కాగానే..నెటిజన్లు పెద్దఎత్తున మండిపడ్డారు. బిగ్‌బాస్ అన్‌ఫెయిర్‌గా ఉందని ట్రోలింగ్ ప్రారంభించారు. ఇనాయా ఎలిమినేషన్‌పై భారీగానే విమర్శలు వచ్చాయి. ఈ వారం ఇనాయా ఎలిమినేట్ అయిపోయింది. కేవలం మరో వారమే మిగిలింది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6కు. అయితే ఊహించని విధంగా వచ్చేవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. అంటే బుధవారం నాడు మరొకరు ఎలిమినేట్ కానున్నారు. ఇక మిగిలిన 5 మంది గ్రాండ్ ఫినాలే వీక్‌లో ఉంటారు. 

Also read: Ashu Reddy Ram Gopal Varma: అషూ రెడ్డి కాలికి ముద్దు పెట్టా.. ఆ ఇంటెన్షన్ వేరు.. క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News