Bindu Madhavi: వైరల్ ట్వీట్.. కోలీవుడ్‌ యంగ్ హీరోతో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం!

Bindu Madhavi, Tamil Hero Harish Kalyan are in Love. బిందు మాధవి, హరీష్ కళ్యాణ్  రిలేషన్‌లో ఉన్నారని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 12:47 PM IST
  • టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లోనే పాపులర్‌
  • కోలీవుడ్‌ యంగ్ హీరోతో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం
  • బిందు మాధవికి హరీష్ కళ్యాణ్ సపోర్ట్
Bindu Madhavi: వైరల్ ట్వీట్.. కోలీవుడ్‌ యంగ్ హీరోతో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం!

Tamil Hero Harish Kalyan extends support to Tollywood Actress Bindu Madhavi: తెలుగమ్మాయి బిందు మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ఆవకాయ బిర్యానీ'తో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకర్షించారు. 'బంపర్ ఆఫర్' సినిమాతో భారీ హిట్ కొట్టినా.. తెలుగులో ఆమె అడపాదడపా సినిమాలే చేశారు. రామరామ క్రిష్ణక్రిష్ణ, పిల జమిందార్ లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ చేశారు. కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు. అయితే టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లోనే బిందు మాధవి ఎక్కువ పాపులర్‌ అయ్యారు.  

బిందు మాధవి కొన్నాళ్లుగా టాలీవుడ్‌కు దూరమయ్యారు. ఇటీవలి కాలంలో ఆమె ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. అయితే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ అయిన 'బిగ్ బాస్ నాన్ స్టాప్‌'తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తనదైన ఆటతీరుతో అలరిస్తున్న తెలుగమ్మాయికి సోషల్‌ మీడియాలో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అభిమానుల అండతో టైటిల్‌ హాట్‌ ఫేవరేట్‌గా దూసుకుపోతున్నారు. అయితే ఈ రియాలిటీ షోలో తన ఆటను సపోర్ట్ చేస్తూ తమిళ యంగ్‌ హీరో హరీష్ కళ్యాణ్ ఓ పోస్ట్ పెట్టాడు.

'నా ప్రియమైన స్నేహితురాలు బిందు మాధవికి శుభాకాంక్షలు. 'బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో బాగా ఆడుతున్నావ్' అంటూ హరీష్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం యువ హీరో హరీష్ కళ్యాణ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. దాంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు బిందుకి హరీష్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే.. ఇద్దరిలో ఒకరు స్పందించాల్సి ఉంది. 

తమిళ బిగ్ బాస్ సీజన్‌1 లో బిందు మాధవి పాల్గొని హైలట్ అయ్యారు. హీరో హరీష్ కళ్యాణ్ కూడా అదే సీజన్‌లో మరో కంటెస్టెంట్‌గా ఉన్నాడు. బిగ్ బాస్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం తెలుస్తోంది. తాజాగా మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ ప్రేమకథల్లాగానే వీరి లవ్ ట్రాక్ కూడా షో అయిపోగానే కనుమరుగయిపోతుందని అందరూ అనుకున్నా.. అలా జరగలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

Also Read: Naga Chaitanya Fined: హీరో నాగ చైతన్యకు ట్రాఫిక్ పోలీస్ జరిమానా...

Also Read: Shivatmika Rajasekhar: రాజశేఖర్ కూతురు లేచిపోయిందంటూ దుష్ప్రచారం... రూమర్స్‌పై శివాత్మిక రాజశేఖర్ ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News