Bigg Boss Telugu 7 : ఈవారం డబుల్ ఎలిమినేషన్.. మొదటి రోజు నామినేట్ అయ్యింది వీళ్లే..

Bigg Boss Telugu: ప్రస్తుతం బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా సోమవారం వచ్చిందంటే  ఎవరెవరు నామినేషన్ అవుతారు అని తెగ ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో నిన్న నామినేషన్ ప్రక్రియ యమ జోరుగా సాగింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2023, 10:40 AM IST
Bigg Boss Telugu 7 : ఈవారం డబుల్ ఎలిమినేషన్.. మొదటి రోజు నామినేట్ అయ్యింది వీళ్లే..

Bigg Boss nominations: ప్రస్తుతం బిగ్ బాస్ షో కథ రెండు సీజన్ కూడా మంచి టిఆర్పి తెచ్చుకుంటూ కొనసాగుతోంది. ఈ పద్యంలో ఫైనల్స్ దగ్గర పడుతూ ఉండటంతో హౌస్ మేట్స్ మరింత ఉత్సాహంగా అంటే ని ఆడుతున్నాడు. కాగా ఈ ఆదివారం ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వని సంగతి తెలిసిందే. అయితే దాని బదులు ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో నిన్న సోమవారం నామినేషన్ ప్రక్రియ యమ జోరుగా సాగింది.

ముందుగా సోమవారం అంతా కూడా ఆదివారం ఎవడు ఎలిమినేట్ అవ్వలేదు అనే దానిపైన చర్చించుకున్నారు హౌస్ మేట్స్ . సోమవారం నాడు అంతా దీని గురించే చర్చించుకున్నారు. ఆ తరువాత నామినేషన్స్ ప్రక్రియ మొదలుకాగా ఈ వారం నామినేషన్స్ లో వెరైటీగా ఒక గుహలో ఏర్పాటు చేశారు. బిగ్ బాస్ ఆ గుహలో  ఒక సింహం బొమ్మ పెట్టారు. సింహం ఆకలిమీద ఉంది, మీరు ఎవర్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ బొమ్మ ఉన్న చికెన్ ముక్క సింహం నోట్లో మీరు వెయ్యాలి అదే ఈ వారం నామినేషన్ ప్రక్రియ అని తెలియజేశారు.

నామినేషన్స్ లో మొదటి ఛాన్స్ అమర్ దీప్ కి రాగా అమర్ దీప్ కి ఎవిక్షన్ పాస్ లో తప్పుడు గేమ్ ఆడినందుకు యావర్ ని నామినేట్ చేశాడు. ఇక ఆ రీజన్ తో రామినేట్ చెయ్యడం వల్ల వీరిద్దరి మధ్య కొంచెం గొడవ మొదలైంది. ఇక ఫైనల్ గా నువ్వు కూడా కావాలంటే నన్ను నామినేట్ చేసుకో అని చెప్పారు అమర్దీ. తరువాత రెండో నామినేషన్ గా రతిక పేరు తెలియజేశారు. ఆ తరువాత గౌతమ్ ఛాన్స్ రాగా ప్రశాంత్, శివాజీలను నామినేట్ చేశాడు. దీంతో గౌతమ్ కి ప్రశాంతికి కూడా కొంచెం గొడవ జరిగింది. ముఖ్యంగా ప్రశాంత్.. గౌతమ్ కట్టుకొచ్చిన పంచె జారిపోద్ది జాగ్రత్త అంటూ మాట్లాడటంతో గౌతమ్ సీరియస్ అయి ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడు. ఇక ఫైనల్ గా ఆ మాట అన్నందుకు ప్రశాంత్ క్షమాపణలు కోరారు.

ఇక రతిక.. అమర్ దీప్ ని, ప్రశాంత్ ని నామినేట్ చేసింది. ప్రశాంత్.. ఛాన్స్ వచ్చేసరికి ప్రశాంత్ గౌతమ్, రతికలను నామినేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విని మాత్రం సిల్లీ కారణాలతో  ఎవర్ని నామినేట్ చేయదలుచుకోవట్లేదని చెప్పడంతో బిగ్ బాస్ అయితే సెల్ఫ్ నామినేట్ అవుతావు అని అడిగాడు దానికి ఒప్పుకుంటూ సెల్ఫ్ నామినేషన్ అయింది అశ్విని. ఇక అశ్విని చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

అంతేకాదు ఈవారం డబల్ ఎలిమినేషన్ ఉండడంతో అశ్విని తప్పకుండా డేంజర్ జోన్ లో ఉంది అని తాను ఎలిమినేట్ అవ్వచ్చు అని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఇక మిగిలిన నామినేషన్స్ నేటి ఎపిసోడ్ లో ఉండనున్నాయి.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News