BB 7 Elimination: ఈ వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్.. డేంజర్ జోన్ లో సీరియల్ నటి..

BB7 latest: బిగ్ బాస్ 7 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. ఈ వారం ఎవరూ హౌస్ నుంచి వెళ్లిపోతారా అని అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొని ఉంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2023, 04:14 PM IST
BB 7 Elimination: ఈ వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్.. డేంజర్ జోన్ లో సీరియల్ నటి..

Bigg Boss 7 Updates: బిగ్ బాస్ 7 తెలుగు ఏడో వారం ముగింపు దశకు చేరుకుంటుంది. ఉల్టా పుల్టాగా సాగుతున్న ఈ సీజన్ లో ఈ వారం కూడా అమ్మాయే వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. వారే అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, భోలే షావలి, అశ్విని శ్రీ, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, పూజా మూర్తి. ఇక ఓటింగ్ విషయానికొస్తే.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు అత్యధిక ఓట్లతో మెుదటి స్థానంలో ఉన్నాడు. 45 శాతం ఓట్లు రైతు బిడ్డకే పడుతూ వచ్చాయి. రెండో స్థానంలో సీరియల్ అమర్ దీప్ చౌదరి, మూడో స్థానంలో డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ఉన్నారు. 

సింగర్ భోలే అనుహ్యంగా నాలుగో స్థానానికి దూసుకొచ్చాడు. మెుదటి రోజు బూతులు, గొడవలు కారణంగా అట్టడుగున ఉన్న భోలేకు రాను రానూ ఓటింగ్ పెరుగుతూ రావడమే దీనికి కారణం. ఇక ఐదో స్థానంలో టేస్టీ తేజ కొనసాగుతున్నాడు. చివరి రెండు స్థానంలో అశ్విని శ్రీ, పూజా మూర్తి ఉన్నారు. ప్రస్తుతానికి వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఉండబోతుందట. సాధారణంగా ఆదివారం నాడు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తారు, కానీ ఈ సారి శనివారం రోజున హౌస్ నుంచి పంపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ ను ఇవాళ చిత్రీకరించనున్నారట. 

ప్రస్తుతం దసరా సీజన్ నడుస్తుండటంతో ఆదివారం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుందట బిగ్ బాస్ టీమ్. దాని కోసం శనివారం రోజునే ఎలిమినేషన్ చేయనున్నారట. ఈ వారం సీరియల్ నటి పూజామూర్తి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే వరుసగా ఏడో వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

Also Read: Tiger Nageswara Rao OTT: టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News