Bigg Boss Keerthy : అయ్యో ఉన్న 'కీర్తి' కూడా పాయే.. అందరి ముందు నల్లమొహం వేసిందిగా

బిగ్ బాస్ ఇంట్లో కీర్తి జనాలను అంతగా ఎంటర్టైన్ చేయడం లేదు. తనది తాను ఆట బాగానే ఆడిందని అనుకుంటూ ఆ భ్రమలోనే ఉండిపోయింది. కెప్టెన్ అయిన తరువాత కూడా నాగార్జున తనను పొగడలేదని హర్ట్ అయింది. ఇంత కష్టపడి ఆడితే.. అసలు గుర్తింపే లేదు.. ఎంకరేంజ్మెంట్ లేదని తెగ బాధపడిపోయింది. కన్నీరు పెట్టుకుంది. ఈ శనివారం నాటి ఎపిసోడ్లోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2022, 11:05 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో ఆరో వారాంతం
  • అందరి ముందు కీర్తికి అవమానం?
  • తనని తాను కించపర్చుకున్న కీర్తి
Bigg Boss Keerthy : అయ్యో ఉన్న 'కీర్తి' కూడా పాయే.. అందరి ముందు నల్లమొహం వేసిందిగా

Bigg Boss Keerthy : బిగ్ బాస్ ఇంట్లో కీర్తి జనాలను అంతగా ఎంటర్టైన్ చేయడం లేదు. తనది తాను ఆట బాగానే ఆడిందని అనుకుంటూ ఆ భ్రమలోనే ఉండిపోయింది. కెప్టెన్ అయిన తరువాత కూడా నాగార్జున తనను పొగడలేదని హర్ట్ అయింది. ఇంత కష్టపడి ఆడితే.. అసలు గుర్తింపే లేదు.. ఎంకరేంజ్మెంట్ లేదని తెగ బాధపడిపోయింది. కన్నీరు పెట్టుకుంది. ఈ శనివారం నాటి ఎపిసోడ్లోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది.

ఈ ఆరోవారం ఇంటి సభ్యుల ఆట ఎలా ఉందో చెబుతూ గుడ్,యావరేజ్, డెడ్ అంటూ ఇచ్చాడు. అందులో ఫైమాకు గుడ్ అని ఇచ్చాడు. కీర్తి వంతు వచ్చింది. ఆమెకు యావరేజ్ అని ఇచ్చాడు.కానీ కీర్తి మాత్రం తన ఆట తాను బాగానే ఆడాను అని అనుకుంది. బాల్స్ టాస్కులో తాను, ఫైమా ఒకేలా ఆడాం కదా? ఆమెకు గుడ్ ఎందుకు ఇచ్చారు.. నాకు యావరేజ్ ఎందుకు ఇచ్చారు? అని నాగార్జుననే నిలదీసింది.

అయితే ఇలా అడిగి తన స్థాయి ఏంటో తానే అందరి ముందు బయటపెట్టేసుకుంది. నువ్ ఆ బాల్ టాస్క్ తప్పా మిగతాది ఏం ఆడావో ఒక్కసారి గుర్తు చేసుకుని చెప్పు అని నాగార్జున అన్నాడు. దీంతో ఆమె నీళ్లు నమిలేసింది.పోనీ ఆడియెన్స్‌ను అడుగుదాం.. కీర్తి ఆట ఎలా ఉంది గుడ్? అని అడిగాడు. ఆడియెన్స్ అంతా అడ్డంగా తలూపారు. దీంతో కీర్తి మరింతగా కుంగిపోయినట్టు అనిపించింది.

సరే నన్ను కన్విన్స్ చేయనక్కర్లేదు.. ఆడియెన్స్‌ను అడుగు.. అని కీర్తికి చాన్స్ ఇచ్చాడు. నేనేం చెప్పాలి సర్.. వాళ్లు అన్నీ చూస్తున్నారు కదా? అని కీర్తి అనేసింది. అందుకే వాళ్లు యావరేజ్ అని అన్నారు అని కీర్తికి కౌంటర్ వేస్తాడు. ఆట అంటే.. ఆటే కాదు.. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి.. నీ దగ్గరి నుంచి వాళ్లు ఎక్కువ ఆశిస్తున్నారు.. నీ శక్తి, సత్తా ఏంటో నాకు తెలుసు.. అందుకే నీ నుంచి ఇంకా రావాలని నేను చెబుతున్నాను.. ఇంకా ఆడు అని సలహా ఇచ్చాడు.

ఈ వారం గుడ్ అని ఇవ్వాలా? అని ఆడియెన్స్‌ను కీర్తి గురించి అడిగాడు నాగ్. వచ్చే వారం చూద్దామని ఆడియెన్స్ అనడంతో కీర్తి మూసుకుని కూర్చుంది. బిగ్ బాస్ ఇంట్లో కీర్తి ఏడుపులు తప్పా నవ్వింది ఎప్పుడూ లేదు. ఎంటర్టైన్మెంట్ చేయడంలో కీర్తి జీరో. కానీ ఆమె మాత్రం ఫైమాతో పోల్చుకుంటోంది. మరి కీర్తి మున్ముందు ఆటను మార్చుకుంటుందో లేక ఇంకా ఇలానే ఉంటుందా? అన్నది చూడాలి.

Also Read : Katragadda Murari Death : టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత

Also Read : Geetha Singh Emotional: నమ్మిన వాళ్లే 6 కోట్లు నొక్కేశారు.. రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్.. గీతా సింగ్ ఎమోషనల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News