Bigg Boss 4 Telugu Abhijeet: గ్రాండ్ ఫినాలే అసలు ఆట నేటి నుంచి మొదలుకానుంది. అయితే 14వ వారం నామినేషన్‌కు రాగానే బిగ్‌బాస్ తెలుగు 4 ఓట్లు అమాంతం రెట్టింపయ్యాయి. పైగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన అభిజిత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో అభిజిత్ పేరు మార్మోగిపోయేలా రికార్డ్ ట్వీట్లు (#WeAdmireAbijeet) చేశారు. మరోవైపు ఫ్యాన్స్ మద్దతోనే అభిజత్ బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4)లో చివరి అడ్డంకిని దాటేసి ఫైనల్‌లోకి ప్రవేశించాడు.
Also Read : Vote for Abhijeet: సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ క్యాంపెయిన్.. ఉద్యమంలా ఓటింగ్
అతి తక్కువ సమయంలో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అభిజిత్ (Abhijeet) ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా ట్రెండ్ క్రియేట్ చేశారు. 24 గంటల వ్యవధిలోపే అభిజిత్‌కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్‌తో 5లక్షలకు పైగా ట్వీట్లు చేయడం గమనార్హం. దీంతో బిగ్ బాస్ 4 (Bigg Boss 4 Telugu) ఇంట్లో అభిజిత్ ఎంత స్ట్రాంగ్ అనేది మరోసారి స్పష్టమైంది. ఈ క్రమంలో Bigg Boss 4 Telugu Finaleలో టాప్ 3 కంటెస్టెంట్‌గా చోటు దక్కించుకున్నాడు.
Also Read : Bigg Boss Telugu 4 Voting numbers: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్
శనివారం కేవలం ఇస్మార్ట్ సోహైల్‌ను సేవ్ చేసి టాప్ 2 కంటెస్టెంట్‌గా గ్రాండ్ ఫినాలేకి హోస్ట్ నాగార్జున పంపించారు. ఆదివారం రోజు మొదటగా అభిజిత్ సేవ్ అయ్యి టాప్ 3 కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ తెలుగు 4 ఫినాలేలోకి ప్రవేశించాడు. ఆపై దేత్తడి హారిక, అరియానా కూడా సేవ్ అయ్యారు. అయితే గుజరాతీ భామ మొనాలో గజ్జర్ టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచి, ఫైనల్ బెర్త్ దక్కించుకోలేక ఇంటి బాట పట్టింది. బిగ్‌బాస్ 4 దత్తపుత్రిక మొనాల్ ఎట్టకేలకు ఎలిమినేట్ అయ్యారని ప్రేక్షకులు స్పందిస్తున్నారు.
Gallery: Payal Rajput Photos: నటి పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ ఫొటోస్
కాగా, తాజాగా సోషల్ మీడియాలో అభిజిత్ ట్రెండ్ (#WeAdmireAbijeet) కావడం, అది కూడా ఇతర ఏ కంటెస్టెంట్స్‌కు సాధ్యంకాని రీతిలో 24 గంటల్లోనే 5 లక్షలట్వీట్లు సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. దీంతో అభిజిత్ బిగ్‌బాస్ 4 తెలుగు టైటిల్ విన్నర్ అవుతాడని అంచనాలు పెరిగిపోతున్నాయి. కానీ, టాస్క్‌లలో తక్కువ ప్రదర్శన చేసే అభిజిత్ టైటిల్ కోట్టాలంటే మాత్రం తుదిమెట్టుపై మరింత ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
Also Read : Solar Eclipse 2020 Date and Timings: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడు.. భారత్‌లో పరిస్థితి ఏంటంటే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe