Movie Tree Collapse In Kumaradevam: పాత తరం సినిమాల్లో ఆ చెట్టు తప్పనిసరిగా ఉండేది. ఆ చెట్టు కనిపిస్తే సినిమా హిట్టే అని నమ్మేవారు. అంతటి ప్రాశస్త్యం కలిగిన చెట్టు కుప్పకూలింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఆ చెట్టు కుంగిపోయి నదిలోకి ఒరిగింది. ఆ చెట్టు కిందనే ఎన్టీఆర్, శోభన్‌బాబు, శ్రీదేవి తదితర అగ్ర నటీనటులు నటించారు. అక్కడే పాటలు.. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆ చెట్టు కూలడంతో సినీ వర్గాలతోపాటు అక్కడి స్థానికులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
Also Read: Ali Double Entry: రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసిన నటుడు అలీ 'డబుల్ ఇస్మార్ట్' జోష్‌తో సినిమాల్లోకి..
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని కుమారదేవం గ్రామం ఉంది. ఆ గ్రామం గుండా ప్రవహించే గోదావరి నది ఒడ్డుపై 150 సంవత్సరాల నాటి చెట్టు ఉంది. గోదావరి నది ఇతివృత్తంగా తీసిన అన్ని సినిమా షూటింగ్‌లో ఈ చెట్టు కనిపిస్తుంది. పాడిపంటలు, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు, మూగ మనసులు, పద్మవ్యూహంతోపాటు అనేక సినిమాల్లో ఈ చెట్టు కనిపిస్తుంది. అనేక సినిమాల్లో ఈ చెట్టు వద్ద పాటలు చిత్రీకరించారు. ఈ చెట్టును సినిమాలో చూపిస్తే హిట్ అనే నమ్మకం కూడా ఉండేది.
Also Read: Double iSmart: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ విడుదల.. ఎంటర్టైన్మెంట్ డబుల్.. అంచనాలు కూడా డబుల్..!
దర్శకులు వంశీ, కె విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్ర రావు తమ సినిమాల్లో ఈ చెట్టు కేంద్రంగా తప్పనిసరిగా ఒక సన్నివేశం తీసేవారు. గోదావరి అందాలను సినిమాల్లో గొప్పగా చూపించే దర్శకుడు వంశీ ఈ చెట్టుతో ప్రత్యేక అనుబంధం ఉండేది. స్నేహితులతో కలిసి వంశీ అక్కడ భోజనం చేసేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. ఇలా ఈ చెట్టు వద్ద దాదాపు 300 సినిమాల షూటింగ్‌లు జరిగి ఉంటాయని కుమారదేవం గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామానికి విశేష గుర్తింపు తెచ్చిన చెట్టు కూలిపోవడంతో కుమారదేవం ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter