Bheemla Nayak Trailer: పవన్ అభిమానులకు మళ్లీ నిరాశే.. మరోసారి వాయిదా పడ్డ భీమ్లా నాయక్ ట్రైలర్.. ఎప్పుడంటే..?

Bheemla Nayak Trailer: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'భీమ్లా నాయక్' మూవీ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్ర ట్రైలర్ ముహూర్తాన్ని ప్రకటిస్తూ.. చిత్రబృందం ఓ ట్వీట్ చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2022, 08:42 PM IST
    • భీమ్లానాయక్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్
    • చిత్ర ట్రైలర్ ను రాత్రి 8.10 గంటలకు రిలీజ్ చేయనున్న మేకర్స్
    • సోమవారం రాత్రి జరగనున్న ప్రీ - రిలీజ్ ఈవెంట్
Bheemla Nayak Trailer: పవన్ అభిమానులకు మళ్లీ నిరాశే.. మరోసారి వాయిదా పడ్డ భీమ్లా నాయక్ ట్రైలర్.. ఎప్పుడంటే..?

Bheemla Nayak Trailer Postponed : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఫిబ్రవరి 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచేసిన చిత్రబృందం.. నేడు (సోమవారం) హైదరాబాద్ లో చిత్ర ప్రీ - రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుంది. యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు హాజరు కానున్నారు. మరో స్పెషల్ గెస్ట్స్ గా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. 

ట్రైలర్ ముహూర్తం

సోమవారం జరగనున్న 'భీమ్లా నాయక్' మూవీ ప్రీ - రిలీజ్ ఈవెంట్ లో చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 21న రాత్రి 8.10 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు సితార ఎంటర్ టైన్మెంట్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకోగా.. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. 

 

మలయాళ సూపర్ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి సరసన నిత్యా మేనన్, సంయుక్తా మేనన్ లు నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను సితార ఎంటర్​టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు.  

Also Read: Samantha Best Friend: నువ్వు లేని ఈ జీవితంను అస్సలు ఊహించలేను.. ఫోటో షేర్ చేసిన సమంత!!

Also Read: Allu Arjun Pushpa: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాకు అరుదైన గౌరవం.. మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News