Banita Sandhu: బ్రిటన్ నుంచి కరోనా వైరస్‌ను వెంట తెచ్చిన నటి.. ఆపై రచ్చరచ్చ!

Banita Sandhu Tests Positive For CoronaVirus: షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్ ప్రబలుతున్న సమయంలో బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన నటి బనితా సంధు తన వెంట కరోనా వైరస్ మహమ్మారిని కూడా తీసుకొచ్చింది. 

Written by - Shankar Dukanam | Last Updated : Jan 6, 2021, 12:58 PM IST
  • షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది
  • బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన నటి బనితా సంధు కరోనాను తెచ్చింది
  • ఆసుపత్రికి తరలిస్తుంటే పారిపోయేందుకు యత్నించిన హీరోయిన్
Banita Sandhu: బ్రిటన్ నుంచి కరోనా వైరస్‌ను వెంట తెచ్చిన నటి.. ఆపై రచ్చరచ్చ!

Banita Sandhu Tests Positive For CoronaVirus: షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్ ప్రబలుతున్న సమయంలో అయితే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించుకోక తప్పదు. షూటింగ్ నిమిత్తం బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన నటి బనితా సంధు తన వెంట కరోనా వైరస్ మహమ్మారిని కూడా తీసుకొచ్చింది. పైగా ఆస్పత్రిలో ఉండనంటూ రచ్చరచ్చ చేస్తోంది. 

అక్టోబర్ మూవీ ఫేమ్, బ్రిటీష్ నటి బనితా సంధు సినిమా షూటింగ్ నిమిత్తం గత ఏడాది డిసెంబర్ 20 తేదీన భారత్‌కు వచ్చింది. విమానంలో ప్రయాణించి కోల్‌కతాకు చేరిన ఆ నటి షూటింగ్ పనులతో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ఆమె ప్రయాణించిన విమానంలో ఓ ప్రయాణికుడికి కరోనా వైరస్(CoronaVirus) పాజిటివ్‌గా నిర్ధారించారు. 

Gallery: Anchor Manjusha Photos: యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

అసలే కొత్త వైరస్ స్ట్రెయిన్ కేసుల్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్న బ్రిటన్ దేశం నుంచి వచ్చిన నటి కనుక బనితా సంధును ఆరోగ్య అధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు. బాలీవుడ్(Bollywood) నటికి కరోనా పాజిటివ్ అని సోమవారం నాడు తేలింది. ఆమెను కోల్‌కతాలోని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా నానా హంగామా చేసింది. తాను  ఆసుపత్రిలో చికిత్స తీసుకోనంటూ మొండికేసింది. పారిపోవాలని సైతం యత్నించింది.

Also Read: Happy Birthday Kapil Dev: 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్.. ఆసక్తికర విషయాలు

కాగా, నటి బనితా సంధు వెంట ఉన్న అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తమై అడ్డుకున్నారు. అంబులెన్సులో ఎక్కించి నటి బనితను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బ్రిటీష్ నటి బనితా సంధు.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన అక్టోబర్ మూవీతో భారతీయ చిత్రపరిశ్రమకు పరిచయమైంది. అయితే ఈమెకు సోకింది కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్.. లేక పాత కరోనానా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Gallery: Rashmi Gautam Photos: యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోషూట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News