కృతిశెట్టి లుక్‌ షేర్‌ చేసిన నాగచైతన్య, నాగార్జునకు..చై కౌంటర్

Bangarraju Movie Update Naga Chaitanya introduces Nagalakshmi : బంగార్రాజు మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం జరుగుతున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన నాగార్జున ఫస్ట్‌లుక్, అలాగే లడ్డుండా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో నాగార్జున, నాగ‌చైత‌న్యలు లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఈ మూవీని క‌ల్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 04:43 PM IST
  • సంక్రాంతి కానుక‌గా బంగార్రాజు మూవీ విడుద‌ల
  • బంగార్రాజు మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం
  • కృతిశెట్టి.. నాగలక్ష్మి ఫస్ట్‌లుక్ విడుదల
కృతిశెట్టి లుక్‌ షేర్‌ చేసిన నాగచైతన్య, నాగార్జునకు..చై కౌంటర్

Krithi Shetty introduced as Naga Lakshmi in Akkineni Nagarjuna, Akkineni Naga Chaitanya, Ramya Krishnan starrer Bangarraju: కృతిశెట్టి టాలీవుడ్‌లో (Tollywood‌) వ‌రుస సినిమాలతో దూసుకెళ్తోంది. చేసుకుంటూ వెళుతుంది. సంక్రాంతి కానుక‌గా బంగార్రాజు మూవీని విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క బంగార్రాజు (Bangarraju) మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం జరుగుతున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన నాగార్జున ఫస్ట్‌లుక్, అలాగే లడ్డుండా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో నాగార్జున (Nagarjuna), నాగ‌చైత‌న్యలు లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఈ మూవీని క‌ల్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తున్నారు.

సోగ్గాడే చిన్ని నాయ‌నకు సీక్వెల్‌గా బంగార్రాజు రూపొందుతోంది. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్యకు (Naga Chaitanya) జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. సంక్రాంతికి బంగార్రాజు విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలను వేగ‌వంతం చేశారు. ఇటీవల రిలీజ్ చేసిన నాగార్జున ఫస్ట్‌లుక్, అలాగే ఆయన పాడిన ‘లడ్డుండా’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ క్రమంలో బంగార్రాజులో కృతి శెట్టి (Krithi Shetty) లుక్‌ను విడుదల చేస్తూ ఆమె పాత్రను మేకర్స్‌ వెల్లడించారు. కృతి లుక్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు నాగ చైతన్య. ఇక ఈ పోస్ట్‌పై నాగార్జున స్పందించాడు. ఒకే బాగుంది రా.. మరి బంగార్రాజు గురించి చెప్పవా అంటూ ప్రశ్నించాడు.

 

Also Read : రోజుకు 45 నిమిషాల వ్యాయామంతో శరీరంలో క్యాన్సర్ కు చెక్!

దీనికి చై... బంగార్రాజు (Bangarraju) త్వరలోనే వస్తున్నాడు.. లేడీస్‌ ఫస్ట్‌ అంటూ అందుకే నాగలక్ష్మి (Nagalakshmi) ఫస్ట్‌లుక్ షేర్‌ చేస్తున్నాం అంటూ నాగ్‌ను ట్యాగ్‌ చేస్తూ తాజాగా మరో పోస్ట్ చేశాడు చై. ఇక తాజాగా నాగ చైతన్య షేర్ చేసి కృతి లుక్‌ అదిరిపోయింది. 

ఇక ఉప్పెన సినిమాతో మంచి హిట్ కొట్టిన కృతి వ‌రుస సినిమాలతో దూసుకెళ్తోంది. నాని హీరోగా వస్తున్న శ్యామ్‌ సింగరాయ్‌ మూవీలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే హీరో రామ్‌తో ఒక మూవీలో జతకడుతోంది కృతి శెట్టి (Krithi Shetty). లింగుసామి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అలాగే సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీలో నటిస్తోంది. నితిన్‌తో మాచర్ల నియోజకవర్గంలోనూ (macherla niyojakavargam) ఈ భామ నటిస్తోంది.

Also Read : స్టార్ హీరోతో కృతి శెట్టి లిప్ లాక్.. ఇపుడిదే హాట్ టాపిక్ గురూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News