Bandla Ganesh Satairical Tweets on Vijaya Sai Reddy: వరుస ట్వీట్లతో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే విజయసాయిరెడ్డి తాజాగా ఈనాడు అధినేత రామోజీరావును విమర్శిస్తూ చేసిన కొన్ని ట్వీట్లకు వివాదాస్పద నిర్మాత నటుడు బండ్ల గణేష్ రీ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
‘’కొండపల్లి సీతారామయ్య రచనలను కృష్ణ అనే కలం పేరుతో జీజె రెడ్డి ప్రచురించే వారు. GJ రెడ్డి కింద గుమస్తాగా చేరిన చెరుకూరి రామోజీ డబ్బు ఆశతో జీజె రెడ్డిని వెన్నుపోటు పొడిచి, దేశద్రోహిగా ముద్రవేసి GJ రెడ్డి ఆస్తిని, కొండపల్లి రచనలను దోపిడీ చేశాడు’’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తే దానికి స్పందించిన బండ్ల గణేష్ మీకు ఈ విషయం ఎవరు చెప్పారు విజయసాయి రెడ్డి గారు ఊరికే అడుగుతున్నా తెలుసుకోవాలని ఆత్రుత అంటూ రీ ట్వీట్ చేశారు.
ఇక తర్వాత ‘’రామోజీ!...సమాచారం అడిగితే స్టే. సోదాలు నిర్వహిస్తే కోర్టుకెళ్తావు. మళ్లీ పారదర్శకత, ప్రజాస్వామ్యం అంటూ నీతులు చెప్తావు. ఏ తప్పూ చేయకపోతే ధైర్యంగా విచారణను ఎదుర్కో. అప్పుడు తేలుతాయి నీ బాగోతాలు!’’ అని ట్వీట్ చేస్తే దానికి బండ్ల గణేష్ నాకు తెలిసి రామోజీ రావు గారు 25 వేల కుటుంబాలకు ప్రతి నెలా జీవనోపాధి కనిపిస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఆతృతతో మీకు చెప్తున్నా అంటూ రీట్వీట్ చేశారు.
‘’రామోజీ ఏడుపుగొట్టు వార్తల వెనక ప్రజలకు మేలు జరగాలన్న ఆరాటం జీరో. కుల ప్రయోజనాలు, వ్యాపారాలు, చుట్టాల కాంట్రాక్టులు, భూముల కేటాయింపులు కాపాడుకోవడమే ఎజెండా. జర్నలిజం, విలువలు అన్నీ ఫేకులు, బొంకులే. ఏది అచ్చేసినా జనం గుడ్డిగా నమ్ముతారన్న భ్రమలో జీవిస్తున్నాడు’’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తే మీకు ప్రతి రోజు మంచి సమాచారం అందిస్తాను మంచి విషయాలు చెప్తా మిమ్మల్ని మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతా అంటూ బండ్ల గణేష్ రీ ట్వీట్ చేశారు.
నిజానికి గతంలో కూడా రామోజీరావు మీద విజయ సాయి రెడ్డి అనేక సంచలన ఆరోపణలు చేశారు. ఇక విజయసాయిరెడ్డి బండ్ల గణేష్ మధ్య కూడా పలు సందర్భాల్లో ట్వీట్ల యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరూ కూడా సైలెంట్ అయ్యారు. ఇక బండ్ల గణేష్ ప్రస్తుతానికి ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తన పౌల్ట్రీ వ్యాపారంతో బిజీ బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అది ఎప్పటికీ తెరకెక్కుతుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read: LPG Cylinder Booking: తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేయండి.. భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్
Also Read: Rythu Bandhu: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 28 నుంచే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.