Akhanda: నందమూరి అభిమానులకు శుభవార్త.. ఓటీటీలో అఖండ మూవీ!!

'అఖండ' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. 2022 కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అఖండ సినిమా స్ట్రీమింగ్‌ కానుందట.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2021, 05:45 PM IST
  • నందమూరి అభిమానులకు శుభవార్త
  • ఓటీటీలో అఖండ మూవీ
  • డిస్నీ+ హాట్‌స్టార్‌లో అఖండ సినిమా స్ట్రీమింగ్‌
 Akhanda: నందమూరి అభిమానులకు శుభవార్త.. ఓటీటీలో అఖండ మూవీ!!

Balakrishna's Akhanda movie to Release on OTT : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను షేక్‌ చేస్తున్న చిత్రం 'అఖండ'. న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ (Balakrishna) నట విశ్వరూపానికి ఫాన్స్ అందరూ ఫిదా అవుతున్నారు. డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ (Akhanda).. విడుదలైన తొలి రోజు నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌తో బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలుకొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్‌ని రాబట్టింది. దాంతో నందమూరి అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోతుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. 

'అఖండ' మూవీ ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. 2022 కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney plus Hotstar)లో అఖండ సినిమా స్ట్రీమింగ్‌ కానుందట. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి బాలయ్య బాబు అభిమానులకు కొత్త సంవత్సర కానుక రానుంది. 'యంగ్ టైగర్' ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న విషయం తెలిసిందే. నందమూరి అభిమానులకు డబుల్ ధమాకానే. 

Also Read: R Ashwin: అశ్విన్ ఇదే ఫామ్‌లో ఉంటే.. కుంబ్లే రికార్డు బ్రేక్ అవుతుంది: జహీర్‌ ఖాన్‌

అఖండ సినిమాలో బాలకృష్ణ సరస ప్రగ్యా జైస్వాల్‌ ( Pragya Jaiswal) నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రంను మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ (SS Thaman) సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ కూడా బాగా ప్లస్‌ అయ్యాయి. జగపతి బాబు, శ్రీకాంత్ ప్రత్యక పాత్రలో నటించారు.  బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌ రానుందని ఫిలింనగర్‌ టాక్‌. సినిమా చివరలో అఖండ తన బంధాలన్నింటినీ తెంచుకొని వెళ్లిపోతాడు. అయితే వెళ్లేముందు సినిమాలో ఇంకో పాత్రైన బాలకృష్ణ కూతురికి మాట (నీకు ఆపద వచ్చినప్పుడు నీ ముందు ఉంటాను) ఇవ్వడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News