Bade Miyan Chote Miyan Trailer Talk: అక్షయ్, టైగర్ ష్రాఫ్‌ల 'బఢేమియా ఛోటే మియా' ట్రైలర్ టాక్.. గూస్‌ బంప్స్ తెప్పించే యాక్షన్..

Bade Miyan Chote Miyan Trailer Talk: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ 'బడే మియా ఛోటే మియా'. అలీ అబ్బాస్ జపర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రంజాన్ పండగ సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 26, 2024, 05:40 PM IST
Bade Miyan Chote Miyan Trailer Talk: అక్షయ్, టైగర్ ష్రాఫ్‌ల 'బఢేమియా ఛోటే మియా' ట్రైలర్ టాక్..  గూస్‌ బంప్స్ తెప్పించే యాక్షన్..

Bade Miyan Chote Miyan Trailer Talk: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో బిజీ ఉండే హీరోల్లో ఈయన ముందు వరుసలో ఉంటారు. గత కొన్నేళ్లుగా ఈయన మార్క్ యాక్షన్ సినిమాలేవి రాలేదు. ఇపుడు ఈయన యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి 'బడేమియా ఛోటేమియా' అనే యాక్షన్ సినిమాతో పలకరించబోతున్నారు. గతంలో ఇదే టైటిల్‌తో అమితాబ్ బచ్చన్, గోవిందా నటించిన బ్లాక్ బస్టర్ 'బడేమియా ఛోటేమియా' టైటిల్‌ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు.

అందరి కంటే పెద్ద శత్రువు ఎవరంటే చావుకు అసలు భయపడని వాడు. అలాంటి శత్రువుకు ఐడెంటిటీ, పేరు, చిరునామా లేని వాడు అంటూ ఓ భయంకర శత్రువు మన దేశంపై ఎటాక్ చేయాలని చూస్తాడు. దానికి మన దేశానికి చెందిన ఇద్దరు ఏజెంట్స్ ఆ శత్రువును ఎలా మట్టు పెట్టారనేదే 'బడేమియా ఛోటే మియా' స్టోరీ అని ఈ ట్రైలర్‌లో చూపించారు. బాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రూట్లోనే అక్షయ్ కుమార్ మరోసారి తన పాత పంథాలో యాక్షన్ హీరోగా ఈ సినిమాలో చెలరేగిపోయాడు. అటు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా తనదైన యాక్షన్‌తో అలరించాడు. మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తుంటే ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్‌లో ఉంది. మొత్తంగా సీన్ టూ సీన్ అన్ని సన్నివేశాలను యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేసారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలని కానీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేయడం పక్కా చెప్పొచ్చు. ఈ సినిమాను బాలీవుడ్‌లో సుల్తాన్, టైగర్ జిందా హై వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన అలీ అబ్బాస్ జఫర్ ఈ సినిమాను డైరెక్టర్ చేసారు. వశు భగ్నానీతో పాటు ఇతరులు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు.  

ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ పాత్రలో నటించాడు. అటు హీరోయిన్స్‌గా సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలయ నటించారు. హై ఓల్టెజ్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఉగాది మరియు ఈద్ పండగ నేపథ్యంలో ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

Read More: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News