BA Raju died: బిఏ రాజు ఇక లేరు.. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన టాలీవుడ్

Senior film journalist and producer BA Raju dies of cardiac arrest: ప్రముఖ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్, నిర్మాత బిఏ రాజు ఇక లేరు. మధుమేహంతో బాధపడుతున్న బిఎ రాజు శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. తన తండ్రి బిఎ రాజు ఇక లేరనే విషయాన్ని ఆయన తనయుడే ట్విటర్ ద్వారా ధృవీకరించారు.

Last Updated : May 22, 2021, 01:53 PM IST
  • ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్, నిర్మాత, పీఆర్వో బిఏ రాజు హఠాన్మరణం.
  • టాలీవుడ్‌ని షాక్‌కి గురిచేసిన బిఏ రాజు మృతి.
  • బిఎ రాజు మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళి
BA Raju died: బిఏ రాజు ఇక లేరు.. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన టాలీవుడ్

Senior film journalist and producer BA Raju dies of cardiac arrest: ప్రముఖ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్, నిర్మాత బిఏ రాజు ఇక లేరు. మధుమేహంతో బాధపడుతున్న బిఎ రాజు శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. మధుమేహం ఎక్కువై షుగర్ లెవెల్స్‌లో మార్పురావడంతో అస్వస్థతకు గురైన ఆయనకు అదే సమయంలో గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. తన తండ్రి బిఎ రాజు ఇక లేరనే విషయాన్ని ఆయన తనయుడే ట్విటర్ ద్వారా ధృవీకరించారు. 

బిఏ రాజు సతీమణి బి జయ రెండేళ్ల క్రితమే చనిపోయిన సంగతి తెలిసిందే. బిఏ రాజు, జయ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో సినీ ప్రముఖులు అందరితో సత్సంబంధాలు కలిగిన బిఎ రాజు అకాల మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Also read : Singer Jai Srinivas death: కరోనాతో తెలంగాణ సింగర్ జై శ్రీనివాస్ మృతి

సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయిన బిఏ రాజు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు పీఆర్వోగా పనిచేశారు. సూపర్ హిట్ అనే మ్యాగజైన్‌ ద్వారా బిఏ రాజు అటు సినీ పరిశ్రమకు ఇటు సినీ ప్రేమికులకు మధ్య వారధిగా నిలిచారు. 

బిఏ రాజు మృతి (BA Raju death) గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తూ బిఏ రాజు (BA Raju) కుటుంబానికి తమ సంతాపం ప్రకటిస్తున్నారు. ఇటీవలే ప్రముఖ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్, ఎందరో సినీ ప్రముఖులను తనదైన స్టైల్లో ఇంటర్వ్యూ చేసి అద్భుతమైన హోస్ట్‌గా పేరు సంపాదించుకున్న టీఎన్ఆర్ మృతి (TNR death) నుంచి ఇంకా టాలీవుడ్ తేరుకోకముందే ఇప్పుడిలా బిఎ రాజు దూరమవడం నిజంగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 

Also read : Nandyala Ravi Dies: కోవిడ్-19తో టాలీవుడ్ డైరెక్టర్ నంద్యాల రవి కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News