Avatar 2 Movie Review: అవతార్ ‌- ది వే ఆఫ్‌ వాటర్‌ రివ్యూ.. జేమ్స్ కెమెరూన్ మేజిక్ పని చేసిందా?

Avatar 2 Movie Telugu Review: ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు అందరూ ఎదురుచూస్తున్న అవతార్ రెండో పార్ట్ రిలీజ్ అయింది, ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంటోంది, మరి సినిమా ఎలా ఉందనేది చూద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 16, 2022, 03:12 PM IST
Avatar 2 Movie Review: అవతార్ ‌- ది వే ఆఫ్‌ వాటర్‌ రివ్యూ.. జేమ్స్ కెమెరూన్ మేజిక్ పని చేసిందా?

Avatar 2 Movie Telugu Review: మామూలుగా ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ చేయడం అంత ఈజీ కాదు. మరి, సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించిన సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు అంటే దానికి ఇంకెంత జాగ్రత్త తీసుకుని ఉంటారో అర్థం చేసుకోవచ్చు. 68 ఏళ్ల నిర్మాత, దర్శకుడు జేమ్స్ కెమరూన్ కొత్త సినిమా 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' కూడా అలా రూపొందిందే. అవతార్ సినిమాతో అద్భుతాలు సృష్టించిన జేమ్స్ కామెరూన్ ఇప్పుడు అవతార్ సీక్వెల్ తో వచ్చేశారు, ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు సినిమా రివ్యూలో తెలుసుకుందాం. 
 
అవతార్ 2 కథ Avatar 2 Story ఏమిటంటే?
అవతార్ మొదటి భాగంలో భూమి నుంచి పండోరా అనే గ్ర‌హానికి వెళ్లిన జేక్ (సామ్ వ‌ర్తింగ్‌ట‌న్‌) అక్క‌డే ఓ తెగ‌కి చెందిన నేతిరి (జో స‌ల్దానా)ని ప్రేమించి ఆ తెగ అందరి సమక్షంలో పెళ్లి కూడా చేసుకుంటాడు. నేతిరి తండ్రి వార‌స‌త్వాన్ని అందుకుని ఆ తెగ‌కి నాయ‌కుడ‌యిన జేక్ లోక్, నెట్టాయం, టూక్ అనే ముగ్గురు పిల్ల‌లకు తండ్రవుతాడు. ఇక వారి ద‌త్త పుత్రిక కిరీ, స్పైడ‌ర్ అనే మ‌రో మానవ సంతతి బాలుడితో  క‌లిసి హాయిగా జీవిస్తున్న సమయంలో భూ ప్ర‌పంచం అంత‌రించిపోతుంద‌ని, ఎలాగైనా పండోరాని ఆక్ర‌మించి అక్క‌డున్న ‘నావీ’ తెగ‌ని అంతం చేయాల‌ని మ‌నుషులు మ‌రోసారి సాయుధ‌ బ‌ల‌గాల‌తో పండోరా మీదకు దండెత్తి బయలుదేరతారు.

అయితే యుద్ధం ఇష్టం లేని జేక్ త‌న కుటుంబాన్ని ర‌క్షించుకోవ‌డం కోసం ఈసారి సముద్ర తీరప్రాంతమైన మెట్క‌యినా అనే ఒక ప్రాంతానికి వెళ‌తాడు. మెట్కయినా తెగ రాజు టోనోవ‌రి స‌హ‌కారంతో జేక్ కుటుంబం సైతం స‌ముద్రంలో బ్రతకడం నేర్చుకుంటున్న సమయంలో ఎలాగైనా జేక్‌ని అతడి కుటుంబాన్ని మ‌ట్టు బెట్టాల‌ని భూమి నుంచి వ‌చ్చిన మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్‌), అత‌ని టీమ్ ను ఎలా ఎదుర్కొన్నారు చివరికి ఏమైంది? అనేది మిగ‌తా క‌థ‌.
 
విశ్లేషణ:
ఈ సినిమా అంతా ఒక చందమామ కథలా, ఆ చందమామ కథలోని అద్భుత వర్ణనలు మన కళ్ళముందు వచ్చాయా అన్నట్టుగా విజువల్స్ తో ఆకట్టుకుంది. మొదటి భాగంలో పండోరా గ్ర‌హంలోని సుంద‌ర‌మైన విజువల్స్ తో సాగగా ఇప్పుడు ‘ది వే ఆఫ్ వాట‌ర్’ అంటూ నీటి ప్ర‌పంచంలోకి తీసుకెళ్లాడు జేమ్స్ కామెరూన్‌. జేక్ కుటుంబంతో సహా మెట్క‌యినా ప్రాంతానికి వెళ్లేంత‌వ‌ర‌కు పెద్దగా కొత్తదనం కనిపించకపోయినా అక్క‌డికి వెళ్లాక మనని కూడా ఒక కొత్త ప్ర‌పంచంలోకి తీసుకు వెళ్లినట్టయింది. మొదటి సినిమాలో క‌థ ఎంత‌గా ఆస‌క్తిని రేకెత్తిస్తుందో.. ఇప్పటి రెండో భాగంలో క‌థ కంటే విజువ‌ల్స్‌పైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టారు ద‌ర్శ‌కుడు.

క‌థ‌ని  స‌ముద్ర నేప‌థ్యంలో న‌డ‌పి మ‌రో కొత్త ప్ర‌పంచాన్ని క‌ళ్ల‌కు కకట్టినట్టు మరోలోకానికి తీసుకెళ్లారు. కుటుంబాన్ని కాపాడుకోవడం తండ్రి క‌ర్త‌వ్యమని గుర్తు చేస్తూనే ముందుకి తీసుకువెళ్లాడు. కొన్ని సీన్స్ ఆర్డినరీ హాలీవుడ్ సినిమాల త‌ర‌హాలో సాగడంతో సాగ‌దీత‌గా అనిపించినా సముద్ర సీన్స్ తో ఆకట్టుకున్నాడు. సముద్ర జీవులతో జేక్స్ కుటుంబం స్నేహం, క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. ఇక క్లైమాక్స్ ‘టైటానిక్‌’ని గుర్తు చేస్తుందని చెప్పకతప్పదు. 

నటీనటుల విషయానికి వస్తే:
ఈ సినిమాలో నటించింది నటీనటులే అయినా మోష‌న్ కాప్చ‌ర్ టెక్నాల‌జీతో రూపొందిన సినిమా కావడంతో కొత్త ఫీల్ ఉంటుంది. సామ్ వ‌ర్తింగ్‌ట‌న్ మేల్ లీడ్ గా ఆకట్టుకున్నాడు. తండ్రిగా, ఒక తెగ నాయ‌కుడిగా, వేరే నాయకుడిని ఆశ్రయం కల్పించమని వెళ్లి కోరే వ్యక్తిగా మంచి ఎమోషన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఆయనను ఢీ కొడుతూ  స్టీఫెన్ లాంగ్ కూడా సూపర్ పవర్ లా విరుచుకుపడుతూ ఆకట్టుకున్నాడు. ఇక సామ్ భార్య పాత్రలో నటించిన నటీమణి కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంది. ఇక సామ్ పిల్లల పాత్రలలో నటించిన వారి నటన సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తోంది. జో స‌ల్దానా, సిగోర్నీ వీవ‌ర్‌, జోయ‌ల్, క్లిఫ్‌తోపాటు, కేట్ విన్‌స్లెట్ వంటి వారి నటన కూడా సినిమాకు అసెట్.  

టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే:
ఇక ఈ సినిమా దర్శకుడు జేమ్స్ కామెరూన్ మరోసారి ఈ సినిమాతో సత్తా చాటాడు, 68 ఏళ్ళ వయసులో కూడా ఆయన తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. అయితే అవతార్ మొదటి భాగంతో కంపేర్ చేస్తూ థియేటర్లకు వెళ్లిన వారంతా నిరాశ పడక తప్పదు. అయితే ఒకరకంగా తన మార్క్ చూపలేక పోయాడని చెప్పొచ్చు. అయితే టెక్నీకల్ టీమ్స్ లో ప్రతి వింగ్ కూడా అద్భుత‌మైన ఎఫెక్ట్స్ ఇచ్చారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీతో పాటు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ బాగా సినిమా ప్లస్ అయ్యాయి. నిర్మాణం కూడా నెక్స్ట్ లెవల్లో ఉంది. 

ఫైనల్ గా:
అవతార్ 1 ను దృష్టిలో పెట్టుకుని ఆ మార్క్ కోసం వెళితే కాస్త నిరాశ తప్పదు, ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళ్లే వారు ఫ్యామిలీలతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. 

సినిమా రివ్యూ : అవతార్ 2 
విడుదల తేదీ: డిసెంబర్ 16, 2022
నటీనటులు : శామ్ వ‌ర్తింగ్‌ట‌న్‌, జో సాల్దానా, సగోని వీవర్, జాక్ ఛాంపియన్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, క్లిఫ్ కర్టిస్ తదితరులు 
సినిమాటోగ్రఫీ : రస్సెల్ కార్పెంటర్ 
సంగీతం : సిమన్ ఫ్రాంగ్లేన్ 
నిర్మాతలు : జేమ్స్ కామెరూన్, జాన్ లాండో 
దర్శకత్వం : జేమ్స్ కామెరూన్! 
 రేటింగ్ : 3/5 

Also Read: Saddam Yadamma Raju Back To Jabardasth : కామెడీ స్టార్స్, స్టార్ మాకు ఇక గుడ్ బై.. జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సద్దాం, యాదమ్మ రాజు

Also Read: Varisu Thetre Issue : దళపతి విజయ్ నెం.1 హీరోనట.. అజిత్ అభిమానులను గెలికిన దిల్ రాజు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News