Samantha Love: ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత.. మరోసారి లవ్‌‌లో..!

Samantha comments on love. ప్రేమ, ద్వేషంకు దూరంగా ఉండాలనుకుంటున్నానని.. అయితే అభిమానులు తనపై చూపించే ప్రేమకు కృతఙ్ఞతతో ఉంటానని సమంత అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2022, 07:33 PM IST
  • ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత
  • మరోసారి లవ్‌‌లో
  • ద్వేషంకు దూరంగా ఉండాలనుకుంటున్నా
Samantha Love: ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత.. మరోసారి లవ్‌‌లో..!

Samantha intresting comments about love: సమంత.. సినీ అభిమానులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2010లో వచ్చిన 'ఏమాయ చేశావే' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే తన అందం, నటనతో సామ్ కుర్రకారు మనసును దోచుకున్నారు. ఆ సినిమాలో నాగ చైతన్య, సమంత జోడి అందరిని ఆకట్టుకుంది. 'ఏమాయ చేశావే' భారీ హిట్ కొట్టడంతో.. తెలుగులో సమంతకు వరుస ఆఫర్లు వచ్చాయి. అనతి కాలంలోనే అగ్ర హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 

ఏమాయ చేశావే సినిమాతో అక్కినేని నాగ చైతన్య, సమంత ప్రేమలో పడ్డారు. చాలా ఏళ్లుగా ప్రేమించుకున్న చై-సామ్.. పెళ్లితో ఒక్కటయ్యారు.  ఈ జోడి ఆరంభంలో బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. గత ఏడాది అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో చై-సామ్ ప్రకటించారు. అయితే ఈ ఇద్దరు ఏ కారణంతో విడిపోయారని విషయం ఇప్పటికి ఓ పెద్ద మిస్టరీనే. విడాకుల అనంతరం సామ్ చాలాసార్లు తన ప్రేమ గురించి మాట్లాడారు. తాజాగా కూడా లవ్‌‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

విజయ్‌ సేతుపతి, సమంత, నయనతార కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'కాతువాక్కుల రెండు కాదల్‌'. ఈ సినిమా తెలుగులో 'కణ్మణి ర్యాంబో ఖతీజా' పేరుతో విడులైంది. మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో ఖతీజా పాత్రలో సామ్ అలరించారు. ఈ సందర్భంగా ట్విటర్‌ వేదికగా సమంత అభిమానులతో ముచ్చటించారు. సినిమా గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ ఒకే సమయంలో ప్రేక్షకుల నుంచి ప్రేమ, ద్వేషం రావడం ఎలా ఉందని అడగ్గా.. 'ప్రేమ, ద్వేషంకు దూరంగా ఉండాలనుకుంటున్నా. అయితే అభిమానులు నాపై చూపించే ప్రేమకు కృతఙ్ఞతతో ఉంటా. మరోసారి మాత్రం ప్రేమలో పడకుండా ఉంటాను' అని అన్నారు. 

ప్రేక్షకులను నవ్వించడం కోసమే కాతువాక్కుల రెండు కాదల్‌ సినిమాలోని ఖతీజా పాత్రలో నటించానని సమంత చెప్పారు. ఖతీజా  పాత్రపై విశ్లేషణ చేయకుండా.. అందరూ విరామం తీసుకొని మరీ హాయిగా నవ్వుకోవాలని సామ్ కోరారు. డిప్పం డిప్పం పాట తనకెంతో ఇష్టమని తెలిపారు. నయనతార లాంటి వ్యక్తి మరొకరు ఉండరని, తాను ఇప్పటి వరకు కలిసిన మోస్ట్ హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్లో ఆమె ఒకరని సామ్ చెప్పుకొచ్చారు. 

Also Read: NBK 107 Title: బాల‌కృష్ణ తదుపరి సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌.. ఇక అభిమానులకు పూనకాలే!

Also Read: Sammathame Teaser: ప్రేమ పడదంటూనే ప్రేమలో పడిన హీరో కిరణ్.. 'సమ్మతమే' టీజర్‌ అదుర్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News