O Sathiya Review: ఓ సాథియా.. సినిమా రివ్యూ, రేటింగ్ అండ్ పబ్లిక్ టాక్

కథ ఉంటే ఎంతటి చిన్న సినిమా అయిన ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ సాథియా సినిమా ఎలా ఉందంటే..??

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2023, 01:33 PM IST
O Sathiya Review: ఓ సాథియా.. సినిమా రివ్యూ, రేటింగ్ అండ్ పబ్లిక్ టాక్

చిన్న సినిమాల హావా కొనసా గుతుంది. ఈ రోజు విడుదల అయినా ఓ సాథియా సినిమాలో ఆర్యన్‌ గౌరా, మిస్తీ చక్రవర్తి  హీరో హీరోయిన్లుగా నటించగా..    అన్నపూర్ణమ్మ, శివన్నారయణ, చైతన్య గరికపాటి, క్రేజి ఖన్నా, బుల్లెట్‌ భాస్కర్, అంబరీష్‌ అప్పాజి, దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని తదితరులు నటించారు. ఓ సాథియా సినిమాకి దివ్యభావన దర్శకత్వం వహించగా..  సుభాశ్‌ కట్టా, చందన కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. విన్నూ వినోద్‌ సంగీతం అందించగా.. తన్విక–జస్విక క్రియేషన్స్‌ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో ఇపుడు చూద్దాం.. 

కథ:

వైజాగ్ లో బిటెక్ చేస్తూ సరదాగా గడిపేసే యువకుడి కథే ఓ సాథియా.. ఆ యువకుడి పేరు అర్జున్‌ (ఆర్యన్‌ గౌరా).. అనుకోకుండా ఒక రోజు కాలేజీలో కీర్తి (మిస్తీ చక్రవర్తి) అర్జున్ కంటపడింది. అర్జున్ క్లాస్మేట్స్ రెండు వర్గాలుగా చీలీ ఒక్క క్షణం కూడా పడకుండా కొట్టుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఈ రెండో వర్గం వారు కూడా కీర్తీని చూసి ప్రేమలో పడతారు. రెండు వర్గాల వారు కీర్తి నాదంటే నాది అని కొట్టుకుంటూ ఉంటున్న తరుణంలో అర్జున్ కీర్తికి ఒక సలహా ఇస్తాడు. వాళ్లు నీ వెంట పడకుండా ఉండాలంటే.. నీకో లవర్ ఉన్నాడు అది నేనే అని చెప్పమంటే.. సమస్య తొలగిపోతే చాలు అనుకున్న కీర్తి కూడా అర్జున్ సలహా మేరకు చెప్పటంతో అర్జున్- కీర్తిల మధ్య మంచి స్నేహం మొదలవుతుంది. ఆ స్నేహంలోనే కీర్తితో ప్రేమలో పడ్డ అర్జున్.. ఒక మంచి రోజు చూసి తన ప్రేమ గురించి కీర్తి కి చెపుదాం అనుకునే సమయంలో అకస్మాత్తుగా కనపడకుండా పోతుంది. కీర్తి ఎక్కడకి వెళ్ళింది.. ? ఏం జరిగింది.. ? ఎలా మిస్ అయింది..? అర్జున్ ఏ స్థితిలో కలుస్తాడు.. ? కీర్తి - అర్జున్ ప్రేమను ఓకే చేస్తుందా..? అనేదే తర్వాత 

ఎవరెలా చేశారు..?
ఏ దర్శకుడికి అయినా మొదటి సినిమా అంటే ఛాలెంజిగ్ తో కూడుకున్న పని మరియు అంచనాలని అధిగమించే తరుణంలో ఒత్తిడికి కూడా లోనయ్యే అవకాశం ఉంది. కానీ దర్శకురాలు దివ్యభావన తన మొదటి సినిమాతోనే చిన్న ప్రేమ కథను ఎంత అందంగా తీయొచ్చో తీసి చూపించారు. విజన్ ఉన్న దర్శకులకి మంచి నిర్మాతలు తోడైతే అవుట్ పుట్ కూడా అంతే అందంగా వస్తుందని అనటంలో ఎలాంటి అనుమానం లేదు. ఓ సాథియా సినిమాకి కూడా అదే ప్లస్ అయింది. నిర్మాతలు సుభాశ్‌ కట్టా, చందన కట్టా సపోర్ట్ తో  దివ్యభావన మంచి సినిమాని రూపొందించారు. మంచి కథ చెప్పాలంటే కథనం కూడా చాలా ముఖ్యం, ఇచ్చిన అవకాశాన్ని ఏవినియోగించుకోవటంలో దర్శకురాలు సఫలం అయింది అని చెప్పవచ్చు. ఇక హీతో విషయానికి వస్తే.. క్యారెక్టర్ లో మునిగిపోయాడు, ముఖ్యముగా బ్రేకప్ సాంగ్ లో డ్యాన్స్ లు కుదిరాయి, హీరోయిన్ తన పరిధిమేరకు న్యాయం చేసింది, పాటలు బాగున్నాయి. కెమెరామెన్‌ వేణు తన పనితనాన్ని చక్కగా చూపించాడు. కొన్నిచోట్ల వచ్చే ఎమోషనల్‌ సీన్స్, డైలాగ్స్‌ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్‌లవ్‌కి ఎంతో ఇంపార్టెన్స్‌ ఉంటుంది. అది ‘ఓ సాథియా’ సినిమాలో అణువణువునా కనిపిస్తుంది. 

సినిమా బలాబలాలు–
కథ, కథనం
కెమెరా వర్క్, 
పాటలు
నటీనటులు 
క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్‌
నిర్మాణ విలువలు
మైనస్‌లు– 
ఫస్టాఫ్‌ కొంచెం నెమ్మది 
పెద్ద నటీనటులు మిస్‌
            
రేటింగ్‌– 2.75

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News