Apsara Rani: RGV హీరోయిన్ అప్సరారాణి మరో మసాలా Pepsi Aunty Song రిలీజ్

Apsara Rani Pepsi Aunty Song | పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యాన్‌లో శ్రీనివాస్ చిట్టూరి సీటీమార్ నిర్మిస్తున్నాడు. గోపిచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా జతకట్టింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 21, 2021, 04:11 PM IST
  • యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా సినిమా సీటీమార్
  • రచ్చ మూవీ తీసిన సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు
  • అప్సరా రాణి చిందులేసిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ అవుతోంది
Apsara Rani: RGV హీరోయిన్ అప్సరారాణి మరో మసాలా Pepsi Aunty Song రిలీజ్

మాస్, యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా సినిమా సీటీమార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో రచ్చ మూవీ తీసిన సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా సంపత్ నంది చేశాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యాన్‌లో శ్రీనివాస్ చిట్టూరి సీటీమార్ నిర్మిస్తున్నాడు. గోపిచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా జతకట్టింది.

సీటీమార్ మూవీ నుంచి మాస్ మసాలా సాంగ్ పెప్సీ ఆంటీ సాంగ్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన మర్డర్ మూవీతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నటి అప్సరా రాణి(Apsara Rani) చిందులేసిన ఈ ఐటమ్ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ అవుతోంది. డైరెక్టర్ సంపత్ నంది సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్ కీర్తన శర్మ అద్భుతంగా ఆలపించారు.

Also Read: Uppena Movie: ‘జల జల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేసి Uppena మూవీ యూనిట్

మణిశర్మ బాణీలంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరో మంచి మాస్ బీట్ సాంగ్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ఇటీవల సీటీమార్ సినిమా నుంచి జ్వాలా రెడ్డి అన్న సాంగ్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కబడ్డీ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుంది. గోపీచంద్, తమన్నా(Actress Tamannaah)లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు.

Also Read: Jathi Ratnalu Photos: తిరుమలలో సందడి చేసిన జాతిరత్నాలు నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా

సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మహారాజ్ రవితేజ సినిమా క్రాక్. ఈ మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన అప్సరాణి, తాజాగా సీటీమార్‌లో పెప్సీ ఆంటీ అంటూ స్టెప్పులేసింది. అప్సరా రాణి అందాలను క్యాష్ చేసుకునేందుకు డైరెక్టర్లు, నిర్మాతలు ఆమెకు అవకాశాలిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News