Ante Sundaraniki OTT: 'అంటే సుందరానికి' సినిమా ఓటీటీ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?

Nani's Ante Sundaraniki movie OTT. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న 'అంటే సుంద‌రానికి' సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకున్నట్లు సమాచారం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2022, 05:42 PM IST
  • జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు అంటే సుందరానికి
  • అంటే సుందరానికి ఓటీటీ ఫిక్స్
  • స్ట్రీమింగ్ ఇందులోనో తెలుసా?
Ante Sundaraniki OTT: 'అంటే సుందరానికి' సినిమా ఓటీటీ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?

Nani, Nazriya Nazim starrer Ante Sundaraniki Movie to release on Netflix: న్యాచుర‌ల్ స్టార్ నాని, మలయాళీ న‌జ్రియా న‌జీమ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'అంటే సుంద‌రానికి'.  యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రంను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. జూన్‌ 10న తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 'అంటే సుందరానికి' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ ప‌నిలో బిజీగా ఉంది చిత్ర యూనిట్. 

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న 'అంటే సుంద‌రానికి' సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకున్నట్లు నిర్మాతల్లో ఒకరు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో అంత త్వరగా విడుదల కాదని చెప్పటం విశేషం. ఇటీవల కాలంలో టాప్ హీరోల సినిమాలు రెండు వారాలకే ఓటీటీలలోకి వచ్చేస్తున్నాయి. దాంతో థియేటర్లలో ప్రేక్షకులు కరువయ్యారు. ఇది గమనించిన హీరో నాని ‘అంటే సుందరానికి’ మూవీ రెండు నెలల వరకూ ఓటీటీలో విడుదల చేయవద్దని నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది.

అయితే ఓటీటీ రిలీజ్ అగ్రిమెంట్ ఇదివరకే జరిగి ఉంటే.. హీరో నాని అభ్యర్థనను నిర్మాతలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే.. నాని సూచనను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ నెగటివ్ టాక్ వస్తే మాత్రం వెంటనే ఓటీటీలోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో విడుదలైన భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆచార్య, గని సినిమాలు అనుకున్న తేదీ కంటే.. ముందుగానే ఓటీటీలో వచ్చిన విషయం తెలిసిందే. 

గురువారం (జూన్ 9) 'అంటే సుంద‌రానికి' ప్రీరిలీజ్ ఈవెంట్‌ జరగనుంది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఈ చిత్రంలో సుందర్‌గా నాని, లీల పాత్రలో నజ్రియా నజిమ్ కనిపించనున్నారు. నరేశ్‌, రోహిణి, నదియా, హర్షవర్ధన్‌, రాహుల్‌ రామకృష్ణ, సుహాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాని కామెడీ, నజ్రియా అందం సినిమాకు ప్లస్ కానున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. 

Also Read: Nayanthara-Vignesh Wedding: ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్‌ చేసిన విఘ్నేష్‌! మండపంలో నయనతారకు ముద్దు  

Also Read: Rishabh Pant Record: ధోనీ, కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టిన పంత్.. ఇప్పటికీ రైనానే తోపు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News