Allu Sneha Reddy Pic : బన్నీని కౌగిట్లో బంధించిన స్నేహా రెడ్డి.. వదిలి ఉండలేకపోతోందేమో.. ఎమోషనల్ పోస్ట్

Allu Sneha Reddy missing Allu Arjun అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన భర్తను వదిలి స్నేహారెడ్డి ఉండలేకపోతోన్నట్టుగా ఉంది. అందుకే మిస్ యూ అంటూ పోస్ట్ వేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 05:27 PM IST
  • అల్లు స్నేహారెడ్డి ఎమోషనల్ పోస్ట్
  • వైజాగ్‌లో పుష్ప షూటింగ్‌లో బిజీగా బన్నీ
  • భర్తను వదిలి ఉండలేకపోతోన్న స్నేహారెడ్డి
Allu Sneha Reddy Pic : బన్నీని కౌగిట్లో బంధించిన స్నేహా రెడ్డి.. వదిలి ఉండలేకపోతోందేమో.. ఎమోషనల్ పోస్ట్

Allu Sneha Reddy missing Allu Arjun అల్లు స్నేహారెడ్డి ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఉంది.. అల్లు అర్జున్ ఏమో పుష్ప ది రూల్ షూట్ కోసం వైజాగ్‌లో ఉన్నాడు. ఇలా తన భర్తకు దూరంగా ఉండటంతో విరహ వేదనకు గురవుతున్నట్టుగా కనిపిస్తోంది స్నేహారెడ్డి. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటోను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. బన్నీని కౌగిట్లో బంధించిన ఫోటోను షేర్ చేస్తూ బన్నీని ట్యాగ్ చేస్తూ మిస్ యూ అని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ వేసింది స్నేహారెడ్డి.

బన్నీ మామూలుగా అయితే తన ఫ్యామిలీని వెకేషన్‌కు తీసుకెళ్తుంటాడు. లేదంటే ఇంట్లోనే ఫ్యామిలీకి తగిన సమయాన్ని కేటాయిస్తుంటాడు. పుష్ప రెండో పార్ట్ షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఎంచక్కా ఇంట్లో ఫ్యామిలీతో గడిపాడు. మధ్యలో వెకేషన్లకు కూడా వెళ్లి వచ్చాడు. ఇక రష్యన్‌లో సినిమా ప్రమోషన్స్ అంటూ భార్యతోనూ అక్కడి వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేశాడు.

అలా బన్నీ, స్నేహాలు ఇద్దరూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. బన్నీ సైతం తన భార్య మీద హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు. తన భార్య హాట్‌గా ఉంది కదూ అని సరదాగా పోస్టులు వేస్తుంటాడు. ఇక బన్నీకి సైతం స్నేహారెడ్డి కౌంటర్లు వేస్తుంటుంది.

పిల్లలతో బన్నీ చేసే అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అలా బన్నికి సంబంధించిన పర్సనల్ విషయాలు ఎక్కువగా స్నేహారెడ్డి వల్లే బయటకు వస్తుంటాయి. అందుకే స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు తన భర్తకు ఇలా దూరంగా ఉండలేకపోతోన్నట్టుగా ఉంది.. త్వరగా రా అన్నట్టుగా బన్నికి సిగ్నల్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. మరి దీనికి బన్ని రిప్లై ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి.

Also Read:  K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే

Also Read: K Vishwanath's Death News: కె.విశ్వనాథ్ మృతి.. స్పందించిన చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News